వెన్నపూస కాలనీ యువకుడు పై కత్తితో దాడి..
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ పట్టణం వెన్నపూస కాలనీకి చెందిన గనుపు నాగమయ్య అనే యువకుడిపై అదే ప్రాంతానికి చెందిన పిడతల సుధాకర్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో బంధువులందరూ కలిసి మాట్లాడుతూ ఉండగా విడతల సుధాకర్ కత్తితో దాడికి తెగబడి అడ్డు వచ్చిన నాగమయ్యను పొడవడంతో రక్తస్రావమై కుప్ప కూలిపోగా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు బాధితుడి అన్న గనుపు కోటేశ్వరావు తెలిపారు. వైసిపి నాయకులు పిడతల సుధాకర్, పిడతల బాజీ, చిన్నబాబు, వెంకటరత్నం, దేవదాసు ప్రోత్బలంతో విడతల సుధాకర్ కత్తితో దాడి చేసి హత్య ప్రయత్నం చేసినప్పుడు వినుకొండ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కోటేశ్వరావు తెలిపారు. ప్రస్తుతం గాయపడ్డ నాగమయ్య పరిస్థితి విషమంగా ఉండి స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. (Story:వెన్నపూస కాలనీ యువకుడు పై కత్తితో దాడి..)

