స్త్రీ శక్తి పథకం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయండి
వినుకొండ డిపో మేనేజర్ జె. నాగేశ్వరరావు
న్యూస్ తెలుగు /వినుకొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకంను ఆగస్టు 15 నుండి సిటీ ఆర్డినరీ , మెట్రోఎక్స్ప్రెస్, పల్లెవెలుగు, ఆల్ట్రాపల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడి నుండి, ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసే స్త్రీ శక్తి పధకం అమలులోకి వస్తుంది. ఈ పధకంను ముఖ్యమంత్రి రాష్ట్ర సచివాలయం నుండి లాంఛనంగా ఆగస్టు 15 న ప్రారంభిస్తారు.ఈ సందర్భంగా వినుకొండ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, వినుకొండ డిపో నుండి పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులను శుక్రవారం సాయంత్రం 5 గంకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీ శక్తి పధకం ప్రారంభిస్తారు అని డిపో మేనేజర్ జె. నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లిఖార్జున రావు, ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు పాల్గొంటారన్నారు. మహిళలు ఈ ఉచిత బస్సు సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. (Story:స్త్రీ శక్తి పథకం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయండి)

