అనాధ శవానికి అంతక్రియలు
న్యూస్ తెలుగు/వినుకొండ : మన సేవా సమితి సభ్యులు ఆదివారం అనాధ శవానికి అంతక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు పివి సురేష్ బాబు, సి. హెచ్. భవాని శంకర్ లు మాట్లాడుతూ. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వృద్ధుడు గత రెండు రోజుల క్రితం మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న వినుకొండ పోలీసులు మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చురీలో ఉంచి అతని ఆచూకీ కోసం ప్రయత్నించారు. మృతునికి సంబంధించిన ఆచూకీ పోలీసులకు లభించలేదు. దీంతో సమాచారం తెలుసుకున్న మానవ సేవా సమితి సభ్యులు ఆసుపత్రికి వెళ్లి మార్చురీలో ఉన్న మృతదేహాన్ని సందర్శించి అనాధ శవానికి వారే స్మశాన వాటికలో స్వయంగా అంతక్రియలు చేయడం జరిగింది. మానవ సేవా సమితి స్వచ్ఛంద సంస్థ ఆశయం దిశగా పయనిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు అంజి, మస్తానవలి, జాబీర్, సర్కార్, తదితరులు పాల్గొన్నారు.(Story : అనాధ శవానికి అంతక్రియలు )

