క్యూబాకు సంఘీభావ నిధిని అందించి కార్మిక వర్గాన్ని కాపాడుకుందాం
సిఐటియు వనపర్తి జిల్లా కార్యదర్శి మండ్ల రాజు
న్యూస్ తెలుగు/వనపర్తి : ఆగస్టు 7 గురువారం రోజు వనపర్తి జిల్లా కేంద్రంలో CITU ఆధ్వర్యంలో అమెరికా సామ్రాజవాదం నశించాలని క్యూబా దేశాన్ని ఆదుకోవాలని ఈరోజు జిల్లా కేంద్రంలోని హమాలి ఆశా వర్కర్స్ దగ్గర క్యూబా సంఘీభావ నిధిని వసూలు చేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మండ్ల రాజు మాట్లాడుతూ అమెరికా సామ్రాజవాదం క్యూబా దేశాన్ని ఆ దేశ కార్మిక వర్గాన్ని ఇబ్బందులకు గురిచేస్తూ ఆంక్షలు విధిస్తున్న అమెరికా ఆధిపత్యం చేయడం కోసం వామపక్ష ప్రభుత్వమైన సోషలిస్ట్ క్యూబా దేశాన్ని అమెరికా సామ్రాజ్యవాద ఆంక్షలకు వ్యతిరేకంగా నాటినుండి నేటి వరకు పోరాడుతూనే ఉన్నారు అమెరికన్ సామ్రాజవాదానికి వ్యతిరేకంగా క్యూబకు సంఘీభావంగా ప్రపంచం మొత్తం బాసటగా నిలిచిందని ఆగస్టు 2 నుండి 10 వరకు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా క్యూబా సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది ప్రపంచంలో ఏ కార్మికుడు ప్రజలు కష్టాల్లో ఉన్న వారికి అండగా సిఐటియు నిలబడుతుందని స్ఫూర్తితో ముందుకు పోవాలని కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే సునీత సిఐడియూ జిల్లా కమిటీ సభ్యులు నందిమల్ల రాములు నాయకులు రాములు నాగశేషి మల్లయ్య బుచ్చమ్మ భాగ్య తదితరులు పాల్గొన్నారు.(Story : క్యూబాకు సంఘీభావ నిధిని అందించి కార్మిక వర్గాన్ని కాపాడుకుందాం )