Homeవార్తలుతెలంగాణప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి

న్యూస్‌తెలుగు/ వనపర్తి : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని మౌలిక సదుపాయాలతో పాటు తగిన వైద్య సిబ్బంది ఉన్నందున ప్రసవాల సంఖ్య పెంచే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సురక్షితమైన ప్రసవాలు చేస్తారన్న విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించి నమ్మకాన్ని పొందాలని సూచించారు. మంగళవారం కలెక్టర్ పెద్దమందడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నీ సందర్శించారు. ఆసుపత్రిలో గర్భిణుల ఈ.డి.డి. రిజిస్టరు, ప్రసవాల నమోదు రిజిస్టరు, రక్త పరీక్షల రిజిస్టరు ను పరిశీలించారు. గత నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎన్ని ప్రసవాలు జరిగాయి, ప్రైవేట్ ఆసుపత్రులలో ఎన్ని జరిగాయి అనే వివరాలు రిజిస్టరులో తనిఖీ చేశారు. జులై నెలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేవలం ఒకే ఒక డెలివరీ జరిగినట్లు తెలుసుకున్న కలెక్టర్ ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రంలో ఉన్న వసతులు, సిబ్బంది పై మహిళలకు అవగాహన కల్పించి వారి నమ్మకాన్ని పొందాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చి రోగుల ఒ.పి రిజిస్టరు ను పరిశీలించారు. జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులతో వచ్చే రోగులకు రక్త పరీక్షలు తప్పకుండా నిర్వహించాలని సూచించారు. మండలంలో నమోదు అయిన డెంగ్యూ, మలేరియా కేసులపై ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని, నిలువ నీరు ఉంచకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎక్కడైనా డెంగ్యూ కేసులు నమోదు అయితే వెంటనే సోర్స్ గుర్తించి తొలగించాలని సూచించారు. చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో రక్త నమూనాలు తీసుకొని పరీక్షలు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రికి జ్వరము , జలుబు, ఒళ్ళనొప్పుల తో వచ్చే రోగులందరికీ రక్త పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఎవరికైన ర్యాట్ పరీక్షలో పాజిటివ్ వస్తె వెంటనే ఎలిజా పరీక్ష చేసేందుకు టి హబ్ కు పంపించాలని ఆదేశించారు. కుక్క కాటు, పాము కాటు కు సంబంధించిన మందులు నిల్వలు పెట్టుకోవాలని సూచించారు.
ఎరువుల నిల్వ, ధర వివరాలను దుకాణం బయట సూచిక బోర్డు పై రాసి పెట్టాలి ఏ రకమైన ఎరువులు ఎంత మోతాదులో నిల్వలు ఉన్నాయి, వాటి ధర వివరాలను దుకాణం బయట సూచిక బోర్డు పై ఎప్పటికప్పుడు రాసి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
మంగళవారం పెద్దమందడి మండలంలోని హాకా ఫార్మర్స్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. దుకాణంలో ఏ రకం ఎరువులు ఉన్నాయి? ఎంత నిల్వలు ఉన్నాయి, బోర్డు పై రాసిన నిల్వలు ఆన్లైన్ లో నిక్షిప్తం అయిన నిల్వలను పరిశీలించారు. సూచిక బోర్డు పై నికర నిల్వలు రాసి పెట్టాలని, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని దుకాణం యజమానిని ప్రశ్నించారు. మండలములో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలు అడిగి తెలుసున్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా శ్రీనివాసులు, పెద్దమందడి తహసీల్దార్ సరస్వతి, ప్రోగ్రాం ఆఫీసర్ డా.మంజుల, మెడికల్ ఆఫీసర్, ఇతర సిబ్బంది ఉన్నారు. (Story:ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!