ఎవరు అధైర్య పడవద్దు.. మంచి రోజులు వస్తాయి
న్యూస్ తెలుగు/సాలూరు : కార్యకర్తలు నాయకులు ఎవరు అధైర్య పడవద్దని రానున్న రోజులు మంచి రోజులు వస్తాయని రాజన్న అని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ గిరిజన శాఖ మాత్యులు వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు పిడిక రాజన్నదొర తో అన్నారని తెలిపారు. మంగళవారం తాడేపల్లిలో జరిగిన వైసీపీ పొలిటికల్ అడ్వయిజర్ కమిటీ(పి ఏ సి) సమావేశం ముగిసిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు,మాజీ గిరిజన సంక్షేమ శాఖా మాత్యులు& రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వయిజర్ కమిటీ సభ్యులు పీడిక.రాజన్నదొర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.ఈ సందర్బంగా రాజన్న బాగున్నావా? మన్యం ప్రాంతం ఎలా ఉంది రాజన్న అంటూ పలకరించారు.మన నాయకులకు,కార్యకర్తలకు అధైర్య పడవద్దని చెప్పు అంటూ.మనకు మంచి రోజులు వస్తాయి అని తెలిపారన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో పరిస్థితులను ఆయన సభ్యులకు వివరించారు. మీ ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలను ఒక యాప్ ద్వారా డిజిటల్ లైబ్రరీ ద్వారా ఆన్లైన్ చేసుకుంటే రానున్న రోజుల్లో అన్యాయం జరిగిన వాళ్ళందరికీ న్యాయం చేస్తామని అన్నారని తెలిపారు. (Story:ఎవరు అధైర్య పడవద్దు.. మంచి రోజులు వస్తాయి)

