Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌రాష్ట్రంలో వైసీపీ అనేది ముగిసిన అధ్యాయం

రాష్ట్రంలో వైసీపీ అనేది ముగిసిన అధ్యాయం

రాష్ట్రంలో వైసీపీ అనేది ముగిసిన అధ్యాయం

జగన్‌ తిరిగి అధికారంలోకి రావడం పగటి కల

48 మంది లబ్ధిదారులకు రూ.85.05 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

న్యూస్ తెలుగు/వినుకొండ  : రాష్ట్రంలో వైకాపా అనేది ముగిసిన అధ్యాయం, జగన్ రెడ్డి తిరిగి అధికారంలో రావడం పగటికల అని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చిన పాపానికి భరించలేని అరాచకాలతో చెలరేగి పోయిన వైకాపా కథను ప్రజలు ఎప్పుడో ముగించారని, ఇప్పుడు జగన్‌ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తామంటూ భ్రమల్లో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలపై రాక్షస పాలన నడిపించిన నాయకుడికి తిరిగి అవకాశం రావాలన్న ఆలోచనే ఆశ్చర్యంగా ఉందన్నారు. వినుకొండలోని తన కార్యాలయంలో శుక్రవారం చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని 48 మంది లబ్ధిదారులకు రూ.85.05 లక్షల విలువైన చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చీఫ్‌ విప్ జీవీ గడిచిన ఒక్క ఏడాదిలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో 50,250 మందికి రూ.394 కోట్లు సీఎంర్ఫ్ ద్వారా అందించామన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఒకేఒక్క సంకల్పంతో పని చేస్తున్న ఈ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సహాయం అందిస్తోందని, ఇప్పటివరకు వినుకొండ నియోజకవర్గంలో 604 మందికి రూ.4.72 కోట్లు పంపిణీ చేశామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో 24 గంటల్లోనే సాయం అందించగలుగుతున్నామన్నారు. ప్రజల్ని కాపాడుకునే ప్రభుత్వానికి, జగన్‌లా వేధించి ప్రాణాలు తీసే వారికి ఇదే తేడా అన్న జీవీ కొన్నిరోజులుగా జగన్, వైకాపా చేస్తున్న రాజకీయ విమర్శలు, పోలీసులపై వారి బెది రింపులను తీవ్రంగా ఖండించారు. అవినీతి, అరాచకం అనే రెండు పదాలకే కేరాఫ్‌గా మిగిలి పోయిన వైకాపా ప్రజలు బుద్ధి చెప్పినా సైకోల్లానే ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే పోలీసుల సంగత తేలుస్తామని బెదిరిస్తున్న జగన్‌ కలలు ఎప్పటికీ తీరే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. దళితులు, బీసీల్ని పొట్టన పెట్టుకున్న దారుణాల్ని మరిచిపోయి మళ్లీ అధికారం అంటున్న జగన్ పార్టీకి ఈసారి సింగిల్ డిజిట్ సీట్లు కూడా వచ్చే అవకాశం లేద ని చురకలు వేశారు. జల్లయ్య, చంద్రయ్య లాంటి బీసీలను వేటకొడవళ్లతో నరికించారని, దళితుల డోర్ డెలివరీగా చేసిన నాటి దుర్మార్గాలను జగన్ ఎప్పటికీ కడుక్కోలేరన్నారు. వాటికి శాస్తిగానే ప్రజలు 151 నుంచి 11కి పడేసిన పార్టీకి తిరిగి అధికారం ఎప్పటికీ సాధ్యమయ్యే మాట కాదన్నారు. జగన్‌ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం చీకటిలోకి వెళ్లిపోతుందని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే 94శాతం స్ట్రైక్ రేట్‌, 164 స్థానాలతో కూటమికి పట్టం కట్టారని చెప్పారు. ప్రజల ఆ తీర్పును అంగీకరించకుండా, అధికారంపై భ్రమలో ఉన్న జగన్‌, ఆ పార్టీ నేతలు ఇకనైనా ప్రజాస్వామ్య విలువలకు గౌరవం చూపాలని సూచించారు.(Story : రాష్ట్రంలో వైసీపీ అనేది ముగిసిన అధ్యాయం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!