Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రపంచ యువ స్కిల్ డే కార్యక్రమం..

ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రపంచ యువ స్కిల్ డే కార్యక్రమం..

ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో

ప్రపంచ యువ స్కిల్ డే కార్యక్రమం

న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లో గురువారం నెహ్రు యువ కేంద్రం గుంటూరు వారి సహకారం తో నేచురల్ హెల్త్ కేర్ సెక్రటరీ యన్. భగవాన్ దాస్ ఆధ్వర్యంలో ప్రపంచ యువ స్కిల్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ దాస్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని, విద్యార్థులు చదువుతో పాటు అదనపు స్కిల్స్ కూడ నేర్చుకోవాలని అందులో భాగంగా కంప్యూటర్ పరిజ్ఞానం, చిత్రాలేఖనం, ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ కోర్సెస్, స్పోర్ట్స్ మొదలగున్నవి నేర్చుకోవాలన్నారు. ఇవి వారికీ భవిష్యత్తు లో ఎంతో ఉపయోగ పడుతుందన్నారు.
ఈ కార్యక్రమం నకు రిసోర్స్ పర్సన్ గా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు గజవల్లి సుబ్బయ్య హాజరయ్యారు. గజవల్లి వెంకటసుబ్బయ్య విద్యార్థుల ను ఉద్దేశించి మాట్లాడుతూ యువత ముఖ్యముగా మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మరియు ఒక నిర్దేశిత లక్ష్యాన్ని పెట్టుకొని ఎలా సాధించాలి, కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి కేవలం మార్కులే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ మీద అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కె.శ్రీనివాసరావు, జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు జి.కమలా రామ్, భాగవతుల రవికుమార్ ,డి. శివఫణింద్ర, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. (Story:ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రపంచ యువ స్కిల్ డే కార్యక్రమం..)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!