పెబ్బేరు మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి
11 కోట్ల 26 లక్షలు రూపాయలతో 30 పడకు ఆసుపత్రి
సుమారు 8 కోట్ల రూపాయలతో నిర్మించనున్న గోదాముల నిర్మాణానికి భూమి పూజ
తూడి మేఘారెడ్డి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : బుధవారం పెబ్బేరు మునిసిపాలిటీలో నూతనంగా నిర్మించనున్న 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికీ…. ఇటీవల ప్రమాదవశాత్తు కాలిపోయిన వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాంతో పాటు మరో నూతన గోదాం నిర్మాణానికి MLA భూమి పూజ చేశారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెబ్బేరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 11 కోట్ల 26 లక్షల రూపాయల వ్యయంతో 6 పడకల నుంచి 30 పడకల ఆసుపత్రిగా ఉన్నతీకరించి నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎన్నో ఎళ్లుగా ప్రధానంగా ఉన్న సమస్యను తీర్చేందుకే ప్రభత్వం ప్రస్తుతం రూ.11.26 కోట్లను విడుదల చేసిందన్నారు. పెబ్బేరు మున్సిపాలిటీ జాతీయ రహదారిని ఆనుకుని ఉండడంతో రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భంల్లో క్షతగాత్రులను మొదట పెబ్బేరుకే తీసుకువస్తారని,..గత పాలకుల నిర్లక్ష్యంతో ఇక్కడి ఆసుపత్రిని 6 పడకలకే పరిమితం చేయడంతో ట్రీట్మెంట్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఈ సమస్యపై పూర్తిగా స్టడీ చేసి రాష్ట్రంలో సీఎంతో పాటు మంత్రులను కలిసి వెంటపడి భట్టి విక్రమార్కను ఒప్పించి 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించామని చెప్పారు. దుగా పెబ్బేరు మార్కెట్ యార్డులో గతంలో అగ్ని ప్రమాదంలో దగ్ధమైన గోదాం భవన నిర్మాణానికి, పాటు మరో 5000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మరో గోదాం నిర్మాణానికి ప్రభుత్వం దాదాపు 8 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు ఇందుకు సంబంధించి ఆయన భూమి పూజ చేసే పనులను ప్రారంభించారు. పెబ్బేరు పట్టణం దినదినాభివృద్ధి చెందుతుందని, దానిని దృష్టిలో ఉంచుకొని త్వరలో ఆర్డీవో ఆపీసు, పోలీసు సర్కిల్ ఆఫీసును కూడా తీసుకొస్తున్నట్లు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, పెబ్బేరు మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షులు వెంకట్రాములు, నాయకులు రంజిత్ కుమార్, కిసాన్ సెల్ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, సురేందర్ గౌడ్, గంధం రాజశేఖర్, మైనార్టీ అధ్యక్షులు షకీల్, దయాకర్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, యాపర్ల రాంరెడ్డి, పాతపల్లి సర్పంచ్ రవీందర్, వెంకటేష్ సాగర్, నాయుడు, పెబ్బేర్ పట్టణ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story:పెబ్బేరు మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి)

