ఘనంగా పులుపుల వెంకట శివయ్య వర్ధంతి
ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో అగ్రగణ్యుడు వినుకొండ ప్రాంత నివాసి అమరజీవి కామ్రేడ్ పులుపుల వెంకట శివయ్య స్ఫూర్తితో ముందుకు సాగాలి…ముప్పాళ్ళ..
న్యూస్ తెలుగు / వినుకొండ : మార్క్సిస్టు మేధావి ఆనాడు ఉమ్మడి ఆంధ్ర రాష్టం లో కమ్యూనిస్టు సిద్ధాంతాలను మార్క్సిస్టు బీజాలను నాటి విస్తరింపజేసి వినుకొండ ప్రాంతంలో పలు ప్రజా ఉద్యమాలు చేస్తూ ఎమ్మెల్యేగా గెలిచి ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసిన మహా మేధావి పులుపుల వెంకట శివయ్య సేవలు మరువ లేనివని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు. సోమవారం వినుకొండ శివయ్య స్తూపం వద్ద పులుపుల వెంకట శివయ్య 49వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి. ముప్పాళ్ళ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభకు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు అధ్యక్ష వహించగా. ముప్పాళ్ళ ప్రసంగించారు. పులుపులకు నివాళులర్పించిన అనంతరం కమ్యూనిస్టు యోధులు లైన పఠాన్ ఖాసింఖాన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి. వినుకొండ ప్రాంతంలో పలు ప్రజా ఉద్యమాలు చేపట్టి అసువులు బాసిన అమరవీరులైన పఠాన్ కాసిం ఖాన్, ఏ.ఏ. మోహన్ రావు, జహిరుద్దీన్ ఖాన్, వీరిశెట్టి సీతయ్య, దూద్ నన్నే, గాలెమ్మ, మహారాజ్. పి. ఇస్మాయిల్, ఫకీర్ సాహెబ్, లాలా అహ్మద్, దర్గా మీరావాలి. బాబావాలి, వైయకంటి శివప్రసాద్. యార్లగడ్డ వెంకట శేషయ్య. వి నటరాజ్. పలువురు ఉద్యమ నేతలకు ఈ సందర్భంగా నివాళులర్పించారు. పులుపుల వెంకట శివయ్య వినుకొండ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమం వ్యాప్తికి. ప్రజల్ని చైతన్యపర్చి ఎంతో మందిని కమ్యూనిస్టు యోధులుగా తీర్చిదిద్దారని ముప్పాళ్ళ అన్నారు. కవి కోకిల గుర్రం జాషువా పుట్టిన గడ్డపై. ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా పులుపుల ఎన్నో ఉద్యమాలు నిర్వహించారు అన్నారు. అంబేద్కర్ వ్రాసిన రాజ్యాం గానికి కమ్యూనిస్టు పార్టీ పూర్తి విలువలను ఇస్తూ. భారత కమ్యూనిస్టు పార్టీ బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు. శివయ్య స్తూపం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అరాచక వైసిపి పాలన పోయి వినుకొండలో కూడా అహంకారంతో విర్రవీగిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఓడిపోయిన ఆయన వ్యాపారాలపై దృష్టి పెట్టుకున్నాడని ముప్పాళ్ళ అన్నారు. ఇక టిడిపి ప్రభుత్వం ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీపై చేసిన విమర్శలు. నేడు టిడిపి ప్రభుత్వం మరిచిపోయి అదే పంధా వ్యవహరిస్తున్నదని. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చెయని పక్షంలో ప్రజలను వంచించినట్లే భావించాల్సి వస్తుందని ముప్పాళ్ళ విమర్శించారు. ఆనాడు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబు. లోకేష్. పవన్ కళ్యాణ్ . నేడు అదే స్మార్ట్ మీటర్లు పెట్టిస్తున్నారన్నారు. ఆనాడే సిపిఐ. అమరావతి రాజధాని. విజయవాడ గుంటూరు మధ్యలో ఏర్పాటు చేయాలని కోరిందని. కాగా అమరావతి రాజధాని కోసం 50 వేల ఎకరాలు సేకరించి దాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయకుండా. మరల 40,000 వేలు ఎకరాలు అవసరమని అనడం అన్ని వర్గాల ప్రజలు విస్మయం చెందుతున్నారని ముప్పాళ్ళ అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ పూర్తిస్థాయిలో విస్తరించి చట్టసభల్లో అడుగుపెడితేనే అన్ని వర్గాల ప్రజలకు రక్షణ ఉంటుందని ముప్పాళ్ళ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ. మారుతి వరప్రసాద్, పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి షేక్ హుస్సేన్, వినుకొండ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సిపిఐ సీనియర్ నాయకులు సండ్రపాటి సైదా, నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము, పట్టణ మాజీ కార్యదర్శి పఠాన్ లాల్ ఖాన్, నాయకులు, కొండ్రముట్ల సుభాని, రాయబారం వందనం, ఊట్ల రామారావు, ఏ పవన్ కుమార్, కే మల్లికార్జునరావు, పిన్నబోయిన వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు, కార్యకర్తలు, పార్టీ సానుభూతిపరులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (Story:ఘనంగా పులుపుల వెంకట శివయ్య వర్ధంతి)

