Homeవార్తలుతెలంగాణజి ఎల్ ఐ కెనాల్ కాల్వగట్లను పునరుద్ధరించాలి

జి ఎల్ ఐ కెనాల్ కాల్వగట్లను పునరుద్ధరించాలి

జి ఎల్ ఐ కెనాల్ కాల్వగట్లను పునరుద్ధరించాలి

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా కలెక్టరేట్ కి మంగనూరు గ్రామ రైతులు రాకపోకలకు ఇబ్బంది అవుతుందని కోతకు గురైన జిఎల్ఐ కెనాల్ కాలువగట్లను మరమ్మత్తు చేయాలని సోమవారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగనూరు గ్రామం నుండి గణపురం కు వచ్చినటువంటి జిఎల్ఐ కెనాల్ రెండు వైపులా రోడ్లు ఒక్కోచోట 10 ఫీట్ల నుండి 15,20 ఫీట్ల వరకు కోతకు గురై ఆ కాలువ చుట్టుపక్కల ఉండే రైతులు పొలాలకు వెళ్లేందుకు రాకుండా పొలాలు సాగు చేసేందుకు వీలు లేకుండా ఉంది ఈ సమస్య దాదాపు 200 ఎకరాలకు దారి లేకుండా రాకపోకలు బంధు అయి రైతులు తమ పొలాలను సాగు చేసుకోవడానికి ఈ కాల్వ గట్ల కోతలుపెద్ద సమస్యగా మారాయి గతంలో ఎన్నోసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన వాళ్లు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ సమస్యను వనపర్తి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చాము. ఇప్పటికైనా అధికారులు రైతుల బాధలను అర్థం చేసుకొని తక్షణమే స్పందించి మా సమస్యను పరిష్కారం చేయాలని పేద రైతులము వేడుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మంగనూరు రైతులు, గద్వాల శివారెడ్డి, అల్వాల కురుమూర్తి గౌడ్, ఎం నరసింహ చారి,ఏ మధు గౌడు, అల్వాల కుమార్ గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది. (Story:జి ఎల్ ఐ కెనాల్ కాల్వగట్లను పునరుద్ధరించాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!