రామన్నగట్టు రిజర్వాయర్ పనులు ప్రారంభించకపోతే ఆందోళన చేపడతాము
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి మండలం కాశింనగర్ ఎర్రగట్టు తండాకు చెందిన ఏం.నరసింహ,నీలేశ్వర్ ఆధ్వర్యములో కాంగ్రెస్ పార్టీకి చెందిన 40మంది కార్యకర్తలు మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరినారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నమ్మి ఓట్లు వేశామని కానీ ఉన్న సంక్షేమ పథకాలకు కోతలు పెట్టడం,రామన్న గట్టు రిజర్వాయర్ నిర్మాణ నిర్లక్ష్యం చేయడంతో గౌరవ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి వల్లే అభివృద్ధి సాధ్యం అని పార్టీలో చేరుతున్నాం అని అన్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కాసింనగర్ చుట్టూ పక్కల తండాలు సాగునీటి కోసం పడుతున్న కష్టాలు చూసి కె.సి.ఆర్ గారిని ఊపించి 3.10.2023రోజు 50కోట్ల రూపాయలు రామన్న గట్టు రిజర్వాయర్ నిర్మాణ కోసం మంజూరు చేయడం జరిగిందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వాయర్ నిర్మాణ పనులు చేయడంలో పూర్తి నిర్లక్ష్యం చేసి రైతులను ఇబ్బంది పెడుతుందని ఆయన విమర్శించారు. వెంటనే ప్రభుత్వం రామన్న గట్టు రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో రైతులతో ప్రజలతో కలసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాము అని గౌరవ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేతకాక సంక్షేమ పథకాలు రైతు భరోసా, రైతు భీమా,రైతు రుణ మాఫీ,ధాన్యంపై బోనస్ ఎగ్గొట్టారని అన్నారు. కె.సి.ఆర్ హయాములో 11విడతలుగా రైతు బంధు 72వేల815కోట్లు రైతులకు చెల్లించామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎకరానికి 15వేలు ఇస్తామని మోసం చేసిందని దుయ్యబట్టారు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతు భరోసా ఇచ్చిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ యువతకు 2లక్షల ఉద్యోగాలు,ఆసరా పింఛన్లు 4వేలు,తులం బంగారం,మహిళలకు 2500అని ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
హామీలు నెరవేర్చని కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. ఈ కార్యక్రమములో జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,జిల్లా ఎస్.టి సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్ నాయక్, మాధవ రెడ్డి, ధర్మా నాయక్, మహేశ్వర్ రెడ్డి,శ్రీనివాస్ పూర్ నరసింహ రవి ప్రకాష్ రెడ్డి, నరేష్ ఏర్వ.సాయి ప్రసాద్ ,ప్రేమ్ నాథ్ రెడ్డి,చిట్యాల.రాము, గోపాల్ నాయక్, రేవెల్లి రాము సక్రూ నాయక్, మహేష్ ,తదితరులు పాల్గొన్నారు. (Story:రామన్నగట్టు రిజర్వాయర్ పనులు ప్రారంభించకపోతే ఆందోళన చేపడతాము)

