Homeవార్తలుతెలంగాణ8,9వార్డులలో బిఆర్ఎస్ శ్రేణుల పర్యటన

8,9వార్డులలో బిఆర్ఎస్ శ్రేణుల పర్యటన

8,9వార్డులలో బిఆర్ఎస్ శ్రేణుల పర్యటన

న్యూస్‌తెలుగు/వనపర్తి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు 8,9వార్డులలో పట్టణ పార్టీ అధ్యక్షులు పలుస. రమేష్ గౌడ్ ఆధ్వర్యములో పర్యటించి ప్రజల సమస్యలను బిఆర్ఎస్ నాయకులు తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కాలం గడుపుతుందని నాయకులు అన్నారు.ఇందిరమ్మ ఇండ్లను అర్హులకు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తుందని ప్రజలు వాపోయారు. ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను తెలుసుకొని స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడంలో కాంగ్రెస్ పార్టీ జాప్యం చేస్తుందని ఆరోపిస్తూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బి.ఆర్.ఎస్ విజయ దుందుభి మోగిస్తోంది అని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమములో జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,రైతు సమితి మాజీ అధ్యక్షులు దేవర్ల.నరసింహ మాజీ కౌన్సిలర్స్,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : 8,9వార్డులలో బిఆర్ఎస్ శ్రేణుల పర్యటన )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!