కార్మిక కర్షకుల సమ్మెకు సిపిఎం పార్టీ మద్దతు
న్యూస్ తెలుగు / వినుకొండ : దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్మిక కర్షకుల సమ్మెకు సిపిఎం పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ర్యాలీకి సిపిఎం పార్టీ వినుకొండ కార్యదర్శి బొంకూరి వెంకటేశ్వర్లు నాయకత్వం వహించగా అంగన్ వాడి, ఆశ, భవన నిర్మాణ సంఘం, ఆటో వర్కర్స్ యూనియన్,, మధ్యాహ్న భోజన పథకం, భీమా ఉద్యోగులు, రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘల నాయకుల పాల్గొన్నారు. ర్యాలీ సీఐటీయూ కార్యాలయం నుండి ఆర్టీసి, పల్నాడు రోడ్, ఎల్ ఐ సీ ఆఫీస్, ఎన్ ఆర్ టీ రోడ్ల నుండి శివయ్య స్తూపము వరకు ర్యాలీ నిర్వహీంచారు. ఈ సందర్భంగా ర్యాలీ ని ఉద్యేసించి స్తూపం సెంటర్ లో పల్నాడు జిల్లా రైతు సంఘం కార్యదర్శి ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ దేశంలోనే పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని దిగబట్టారు. జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం విద్యుత్తు రవాణా బ్యాంకులో ఇన్సూరెన్స్ స్టీలు వంటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను విరమించుకోవాలని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం 26 వేలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను ఉద్యోగులను మరింత అభద్రతభావం లోకి నెట్టి వేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను రద్దుచేసి కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడాన్ని ఆయన వ్యతిరేకించారు. భవన నిర్మాణరంగా కార్మికుల వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించాలని కోరారు. రవాణా రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. కార్యక్రమంలో కే శివ రామకృష్ణ, వెంకటప్పయ్య సిహెచ్ శ్రీనివాసరావు, ఏ ఎల్ ప్రసన్న, భాస్కర్, కరిముల్లా, సురేష్ రాజా, జి నవీన్ కుమార్, ఎస్కే రంజాన్ బి, తిరుమల లక్ష్మి నాగలక్ష్మి, రాజారపు ముని వెంకటేశ్వర్లు, ఏ ఆంజనేయులు, గోపాలకృష్ణ, ఫణికుమార్, శేషావలి పాల్గొన్నారు. (Story:కార్మిక కర్షకుల సమ్మెకు సిపిఎం పార్టీ మద్దతు)