Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కళాశాలలో ఉర్దూ అధ్యాపకుడిని ఏర్పాటు చెయ్యాలి

 ప్రభుత్వ కళాశాలలో ఉర్దూ అధ్యాపకుడిని ఏర్పాటు చెయ్యాలి

ప్రభుత్వ కళాశాలలో ఉర్దూ అధ్యాపకుడిని ఏర్పాటు చెయ్యాలి

న్యూస్ తెలుగు / వినుకొండ :

నియోజకవర్గం లోని పట్టణం మరియు చుట్టు ప్రక్కల గ్రామాల ముస్లిం విద్యార్థినీ, విద్యార్థులు ఇప్పటివరకు హైస్కూల్లో ఉర్దూ అభ్యాసం పూర్తి చేసిన వారు చాలామంది ఉన్నారు అని వారిలో ప్రధానంగా ముస్లిం మైనార్టీలకు చెందిన వారు మరియు ఇతర వర్గాలకు చెందిన వారు అధికంగా ఉన్నప్పటికీ ఉన్నత విద్య కొరకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఆ తర్వాత డిగ్రీ చదివేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు అని ఆ సంఘ నాయకులు బాజీద్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మన రాష్ట్రంలో ఉర్దూ భాషను రెండవ అధికార భాషగా ప్రకటిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిఉన్నది అని గుర్తు చేశారు. ఉత్తర్వులకు అనుగుణముగా వినుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉర్దూ అధ్యాపకుని పోస్టును మంజూరు చేయించవలసినదిగా సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువెళుతూ వినతి పత్రం ఇవ్వటం జరిగింది అని తెలిపారు. ప్రభుత్వ కళాశాలలో ఉర్దూ అధ్యాపకుడు లేక ఇతర ప్రైవేట్ కళాశాలలో ముస్లిం (మైనారిటీ) విద్యార్థులు ఫీజుల భారంతో అక్కడికి వెళ్ళలేని పరిస్థితి అదేవిధంగా చాలా రకాలుగా ఇబ్బందులు పడుచున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉర్దూ భాష ఒక మతానికి చెందిన భాష కాదు అని తెలియజేశారు. సంబంధిత సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు దృష్టి సారించి ప్రభుత్వ కళాశాలలో ఉర్దూ అధ్యాపకుడిని ఏర్పాటు దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ డిగ్రీ మరియు జూనియర్ కళాశాలలో చదువుచున్న మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉర్దూ భాషను బోధించుటకు ఈ విద్యా సంవత్సరము నుండి అధ్యాపకుడిని నియమించే విధంగా తగిన ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు షేక్ బాజీద్, కలాముద్దీన్,షేక్ అలీ తదితరులు పాల్గొన్నారు. (Story: ప్రభుత్వ కళాశాలలో ఉర్దూ అధ్యాపకుడిని ఏర్పాటు చెయ్యాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments