మాజీ సైనికుల సంక్షేమ సంఘం అవగాహన సదస్సు
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక నరసరావుపేట రోడ్ లోని ఎన్ ఎస్ పి కాలనీ సాయిబాబా గుడి వద్ద మాజీ సైనికుల సంక్షేమ సంఘం భవనమునందు శుక్రవారం సైనికుల సంక్షేమ సంఘం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్. గుణశీల మన వినుకొండ మాజీ సైనిక సంక్షేమ సంఘం ను సందర్శించి ఇక్కడ ఉన్న మాజీ సైనికులకు, ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేసి తదుపరి డిపెండెంట్ ఐడెంటిటీ కార్డ్స్ జారీ చేయటం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ లకు రావలసిన సంక్షేమాలను వివరంగా తెలిపారు. మాజీ సైనికులకు మరియు వీర నారీలకు సంబంచిన అన్నీ విషయాలగురించి క్లుప్తంగా చర్చించినారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కే ఈశ్వరయ్య, సెక్రెటరీ పాపిరెడ్డి, ట్రెజరర్ రాధాకృష్ణ, సెక్రెటరీ బి బాలరాజు, వైస్ ప్రెసిడెంట్ కె వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.(Story:మాజీ సైనికుల సంక్షేమ సంఘం అవగాహన సదస్సు)

