Homeవార్తలుతెలంగాణసింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యం

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యం

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యం

న్యూస్‌తెలుగు/వనపర్తి : ఘనపూర్ మండలం రుక్కన్నపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్ ఏం.రవినాయక్,నాయకులు కె.బాలు నాయక్,కె.రాములు నాయక్,పి.సంతు నాయక్,ఎం. రేఖ్యానాయక్ తదితరులు గురువారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో స్వగృహంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతులకు,మహిళలకు,వృద్ధులకు,నిరుద్యోగులకు,మహిళలకు ఇచ్చిన హామీలు నమ్మి కె.సి.ఆర్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలను రెట్టింపు చేసి ఇస్తామని చెబితే నమ్మి మోసపోయామని,కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అహర్నిశలు కృషి చేస్తే సంక్షేమ పథకాలు రైతు భరోసా రైతు రుణ మాఫీ రైతు భీమా,బోనస్,మహిళకు 2500,వృద్ధులకు 4000ఆసరా పింఛన్లు,నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి,ఉద్యగాలు కల్పించడంలో ఘోరంగా విఫలం అయ్యిందని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అహంకారం పెరిగి పని చేసిన నాయకులను నిర్లక్ష్యం చేస్తుందని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసిన నేటికి ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల నిధులు లేక గ్రామాలలో అభివృద్ధి కుంటుపడ్డదని అందుకే కార్మికులకు,కర్షకులకు,రైతులకు,మహిళలకు, విద్యార్థుల,హరిజన,గిరిజన,బడుగు,బలహీన,మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన బి.ఆర్.యస్ పార్టీలో చేరుతున్నామని గౌరవ నిరంజన్ రెడ్డి గారి నాయకత్వములో మా మండలాన్ని,గ్రామాన్ని అభివృద్ది పథంలో నిలుపుతామని అన్నారు. ఈ కార్యక్రమములో మాజీ ఎంపీపీ కృష్ణా నాయక్,పార్టీ అధ్యక్షులు రాళ్ళ.కృష్ణయ్య,మాజీ సర్పంచులు నార్య నాయక్, పిన్యా నాయక్,శ్రీను నాయక్,మన్యం గౌడ్,పెంకుల. ఆంజనేయులు,గోత్ర కృష్ణ,చిట్యాల.రాము పాల్గొన్నారు. (Story:సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!