జిమ్ తప్పనిసరిగా చేసి ఆరోగ్యంతో ముందు సాగండి
పీవీ సురేష్ బాబు
న్యూస్ తెలుగు / వినుకొండ : పట్టణంలోని హైటెక్ జిమ్ నందు మానవ సేవ సమితి అధ్యక్షులు పీవీ సురేష్ బాబు జిమ్ కోచ్ అబ్దుల్లా జిమ్ సభ్యులు ఇటీవల కావలిలో జరిగిన బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో 5వ విజేతగా నిలిచిన చీమకుర్తి వీరాంజనేయులు అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా పివి సురేష్ బాబు మాట్లాడుతూ. యువత ప్రతి ఒక్కరూ యోగ మెడిటేషన్ జిమ్ తప్పనిసరిగా చేసి ఆరోగ్యవంతులుగా ఉండాలని, జిమ్ సభ్యులు ప్రజాహితకార్యక్రమాల్లో చూరుకుగా పాల్గొనాలని, హైటెక్ జిమ్ ద్వారా వినుకొండ పట్టణానికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో బాడీ బిల్డర్ ను తయారుచేస్తూ క్రమశిక్షణ కలిగిన కోచిగా గుర్తింపు పొందారు. వారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కోచ్ అబ్దుల్లా మాట్లాడుతూ. చాలా ఆనందంగా ఉంది మా జిమ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్న వీరాంజనేయులు కి మరియు గతంలో పథకాలు తీసుకున్న అందరికి కూడా మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున మా జిమ్ సభ్యులు మంచి పతకాలు తెచ్చి మా వినుకొండ కి, మా జిమ్ముకి మంచి పేరు చేస్తారని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిమ్ సభ్యులు పవన్ శ్రీను, చిన్న, మున్నా, అభి రెడ్డి, అశోక్, తదితరులు పాల్గొన్నారు. (Story:జిమ్ తప్పనిసరిగా చేసి ఆరోగ్యంతో ముందు సాగండి)

