వినుకొండలో పొలం పిలుస్తోంది
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ నియోజకవర్గం లోని ఏనుగుపాలెం ,పెరుమాళ్ళపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి జి.వరలక్ష్మి మాట్లాడుతూ. రైతులు ఎం టి యు 11 61 లాంటి లావు రకములను సాగు చేయరాదని ఒకవేళ సాగుచేసిన ధాన్యము ప్రభుత్వం ద్వారా ప్రొక్యూర్మెంట్ చేయబడదని కనుక రైతు సోదరులు ప్రత్యామ్నాయంగా జేజిఎల్ 384 కేఎన్ఎం 1638 బి పి టి 52 04 సాగు చేసుకోవాలని రైతులు, వరి, మిరప, టొబాకో పంటలు వేసే ముందు పచ్చి రొట్ట విత్తనాలు వేసి పూత దశలో భూమిలో కలిగి దున్నాలని రైతులకు వివరించారు. దీనివలన భూమిలో సేంద్రీయ కర్బన శాతం పెరిగి తద్వారా భూమిలో నిల్వ ఉన్న పోషకాలు, విటమిన్లు, ఎంజైమ్స్, హార్మోనులు మొక్కలకు అందుబాటు రూపంలోకి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో విఏఏ ఏనుగుపాలెం యశ్వంత్ ఏ. ఈ. ఓ. ఆరీఫ్ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ,రైతు సోదరులు పాల్గొన్నారు. (Story:వినుకొండలో పొలం పిలుస్తోంది)

