అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని రెండవ రోజు రిలే నిరాహార దీక్ష
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ పట్టణంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు తోట ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వైఖరికి అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కనికరించి అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని, గత రెండు నెలల నుంచి వినుకొండ పట్టణంలో ఉన్న సర్వేనెంబర్ 212 సీలింగ్ ల్యాండ్ భూమి 1 75 సెంట్లు సుమారు 15 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చట్ట వ్యతిరేకంగా రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు సంబంధించిన రెవిన్యూ అధికారులకి అర్జీలు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని అందుకనే దశల వారి ఆందోళన భాగంగా ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగిందని సోమవారం ఎమ్మార్వో ఆఫీస్ వద్ద వంటావార్పు కార్యక్రమాలు చేపడతామని, అక్రమ రిజిస్ట్రేషన్ అంతవరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలియపరిచారు. ప్రభుత్వాధికారులు అప్పటికి స్పందించబోతే వారం రోజుల్లో పేదలను తీసుకెళ్లి ఇల్లు నిర్మిస్తామని, ఆ తర్వాత జరిగే పరిణామాలు అన్నిటికీ ప్రభుత్వ అధికారులు స్థానిక శాసనసభ్యులు బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్ర మొత్తం అక్రమంగా ఆక్రమించిన భూములను వెలికితీస్తుంటే ఆ భూములు స్వాధీనం చేసుకొని ఆక్రమణదారులపై కేసులు పెడుతుంటే వినుకొండలో మటుకు అధికార పార్టీ ఎమ్మెల్యే మౌనంగా ఉంటాం ఆంత్రయం ఏమిటని ప్రశ్నించారు. నిరాహార దీక్షలు రైతు నాయకుడు ఓబులాపురం ఆంజనేయులు దండలు వేసి ఉద్యమకారులకి మద్దతు తెలిపారు. ఈ రెండో రోజు కార్యక్రమాన్ని పట్టణ కార్యదర్శి ఎస్కె ఫిరోజ్, కార్మిక నాయకుడు మునగపాటి ప్రసాద్, భాస్కర్, చెన్నకేశయ్య, రమణయ్య, అందుగులపాటి పెద్ద వెంకటేశ్వర్లు, గుంటి నాగేశ్వరరావు, శివయ్య తదితరులు ఈ దీక్షలో పాల్గొన్నారు. (Story:అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని రెండవ రోజు రిలే నిరాహార దీక్ష)

