Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌సాలూరులో మున్సిపల్ ఆఫీస్ లో  పిజిఆర్ఎస్

సాలూరులో మున్సిపల్ ఆఫీస్ లో  పిజిఆర్ఎస్

సాలూరులో మున్సిపల్ ఆఫీస్ లో  పిజిఆర్ఎస్

న్యూస్ తెలుగు/సాలూరు :  ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) ను సోమవారం సాలూరులో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాలూరులో మున్సిపల్ ఆఫీస్ లో పిజిఆర్ఎస్* నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వేదికను సాలూరు ఎంపీడిఓ కార్యాలయం నుండి మార్పు చేయడం జరిగిందని, దీనిని ప్రజలు గమనించాలని కోరారు. మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి పిజిఆర్ఎస్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు తమ సమస్యలను తెలియజేయవచ్చని ఆయన చెప్పారు. జిల్లా అధికారులు అందరూ సోమవారం సాలూరులో జరిగే పిజిఆర్ఎస్ లో పాల్గొనాలని ఆయన ఆదేశించారు. (Story:సాలూరులో మున్సిపల్ ఆఫీస్ లో  పిజిఆర్ఎస్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments