ఏజెన్సీ ప్రాంతంలో వైద్యం మంచినీరు అందేలా చర్యలు చేపట్టాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి పోట్టిక సత్యనారాయణ
న్యూస్ తెలుగు/చింతూరు : రంపచోడవరం లో సిపిఐ డివిజన్ కమిటీ సమావేశం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లా పార్టీ కార్యదర్శి కామ్రేడ్ పొట్టి క సత్యనారాయణ గారు హాజరైనారు.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో వైద్యం మౌలిక సదుపాయాలు పూర్తిగా కరువయ్యాయని గత పది రోజుల క్రితం రాజవొమ్మంగి మండలంలోని రెండు శిశు మరణాలు జరిగాయని వైద్యాధికారులకు గాని ఐటీడీఏ పీవో గారికి గాని చీమకుట్టినట్టైనా లేదని ఆయన ధ్వజమెత్తారు. 104 పేరుతో పెద్ద అవినీతి దోపిడీ జరుగుతా ఉందని అందులో వైద్యాధికారుల పాత్ర ఉందన్నారు.అడిషనల్ డిహెచ్ఎంవో గా పని చేస్తున్న అధికారి పీహెచ్సీల పర్యవేక్షణలో పూర్తిగా విఫలమయ్యారని
ఆయన అన్నారు. పిహెచ్సిలో పూర్తిస్థాయిలో వైద్యాధికారులు పనిచేయడం లేదని అడిషనల్ డీఎంహెచ్ఓ పర్యవేక్షణ లేక డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని అందువలన వైద్యం పూర్తిగా అందడం లేదని విమర్శించారు. తక్షణమే అడిషనల్ డీఎంహెచ్వో ని బదిలీ చేసి సమర్థవంతమైన అధికారిని నియమించాలని రాజవొమ్మంగి మండలంలో జరిగిన శిశు మరణాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతం మారుమూల ప్రాంతాల్లో మంచినీటి సదుపాయం లేక నేటికీ చలమనీళ్లు తాగుతున్నారని దానివల్ల మలేరియా డెంగ్యూ వ్యాధులకు గురై మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు తక్షణమే పూర్తిస్థాయిలో మంచినీటి సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డివిజన్ పార్టీ కార్యదర్శి జుత్తుక కుమార్ కమిటీ సభ్యులు దుర్గ వీరన్న గంగరాజు దినేష్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కృష్ణారెడ్డి సుబ్బారావు పాల్గొన్నారు. (Story:ఏజెన్సీ ప్రాంతంలో వైద్యం మంచినీరు అందేలా చర్యలు చేపట్టాలి)

