Homeవార్తలుతెలంగాణమున్సిపల్ చట్టాలకు తూట్లు పొడుస్తున్న అధికారులు

మున్సిపల్ చట్టాలకు తూట్లు పొడుస్తున్న అధికారులు

మున్సిపల్ చట్టాలకు తూట్లు పొడుస్తున్న అధికారులు

న్యూస్ తెలుగు/వనపర్తి : మున్సిపల్ చట్టాలకు అధికారులు తూట్లు పొడుస్తున్నన్నారు అనిమున్సిపల్ చట్టం ప్రకారం వనపర్తి జిల్లాలో విలీన గ్రామాలకు 40 శాతం నిధుల కేటాయింపు తో న్యాయం చేయాలి. కలెక్టర్ కి, ఎమ్మెల్యేకి అఖిలపక్ష ఐక్యవేదిక అన్నారు విలీన గ్రామమైన రాజనగరం అమ్మ చెరువు కట్టను పరిశీలించిన అఖిలపక్ష ఐక్యవేదిక. గత ప్రభుత్వంలో చేపట్టిన చెరువుల పునరుద్దీకరణ పనులు ఇంకా పూర్తి కాలేదని, కట్ట పైనుండి వెళ్లే దారిలో బ్రిడ్జి కావాల్సి ఉందని దాని వల్ల ప్రజలకు ఇబ్బందిగా ఉందని, దానిని వెంటనే పూర్తి చేయాలని అన్నారు.కట్ట పై వెలిసిన టవర్ లైట్లు వెలగడం లేదని, మున్సిపాలిటీ ఇంజనీరింగ్ సెక్షన్ పట్టించుకోవడంలేదని, పూర్తిగా ఫెయిల్ అయిందని, మున్సిపాలిటీ వారు ఆ కట్టపై ఎలాంటి శానిటేషన్ పనులు చేయడం లేదని, మురికి తుమ్మ చెట్లు వెలిసి రాత్రిపూట వెళ్లే ప్రయాణికులకు అలా ఆటంకం కలిగిస్తున్నాయని పాములు తిరుగుతున్న సమయంలో ప్రజలు ప్రయాణిస్తుంటారని వారికి ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు. వెంటనే లైట్లను రిపేర్ చేసి వెలిగించాలని, మురికి తుమ్మ చెట్టును కొట్టేసి శానిటేషన్ చేయాలని అన్నారు . ఊరికి దూరంగా ఉన్న 12వ వార్డు రాజనగరాన్ని మున్సిపాలిటీ పూర్తిస్థాయిలో పట్టించుకోవడం లేదు కనుక కమిషనర్ గారికి కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాలని, అలాగే విలీన గ్రామాలైన మర్రికుంట, శ్రీనివాసపురం, నాగవరం, రాజనగరం, జంగమయ్య పల్లి వార్డులను అభివృద్ధి చేయాలని ఐక్యవేదిక అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ తో పాటు పట్టణ అధ్యక్షుడు రామస్వామి, వెంకటేశ్వర్లు, కొత్త గొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్,కురుమూర్తి,శివకుమార్, గుంట్ల వెంకటేష్, రాజు,కృష్ణయ్య, శ్రీనివాసులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.(Story : మున్సిపల్ చట్టాలకు తూట్లు పొడుస్తున్న అధికారులు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!