ఏ సి బి కి చిక్కిన సబ్ ట్రెజరి అధికారులు
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు లోని సబ్ ట్రెజరి కార్యాలయం పై ఎ సి బి అధికారులు పథకం ప్రకారం దాడి చేసి ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసినట్లు డి యస్ పి నాగేశ్వరావు తెలిపారు. నర్సింహాపురం ఆశ్రమ పాఠశాల లో వార్డెన్ గా పనిచేస్తున్న ఫకీర్ దొర కు పెండింగ్ లో వున్న బిల్లులు పాస్ చేయడం కోసం 2లక్షలు డిమాండ్ చేశారు.అంత ఇచ్చు కోలేనని చెప్పినా 2సార్లు రిజక్ట్ చేశారు.లంచం కోసం డిమాండ్ చేసిన ట్రెజరి ఆఫీసర్ వంశీ కళ్యాణ్,సమ్ముయేల్ సోమవారం అరెస్ట్ చేశారు.నిందితులను మంగళవారం రాజమండ్రి కొర్ట్ లో హాజరు పరుస్తామని తెలిపారు. (Story:ఏ సి బి కి చిక్కిన సబ్ ట్రెజరి అధికారులు)

