వెన్నుపోటు దినం విజయవంతం చేద్దాం
న్యూస్ తెలుగు/సాలూరు : జూన్ 4వ తేదీ తేదీన వెన్నుపోటు దినంగా రాష్ట్ర వైఎస్సార్ పార్టీ ప్రకటించడం జరిగిందని. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు పిడికి రాజన్న దొర అన్నారు. సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎన్నికల్లో గెలవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్పి ఒక్క పథకమైన అమలు చేశారా అని అన్నారు.. ఉచిత బస్సు తుస్సు మని పోయిందని, ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తామని చెప్పి ఇవ్వలేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్పుడు అధికారంలోకి వచ్చిన మోసపూరితమైన హామీలను ఇచ్చి, అవి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూనే ఉంటారని అన్నారు. అమ్మకు వందనం, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ, ఎస్సీ, ఎస్టీ బీసీ, 50 సంవత్సరాల వృద్ధులకు పెన్షన్ ఇస్తామని చెప్పి ఒక్క పథకం కూడా అమలు చేయలేదని అన్నారు. వాలంటరీలని తొలగింపు, ఎండియు వాహనాలను, ఆపివేయడం ఇలా ప్రతి ఒక్క ప్రజా సంక్షేమ పథకాలన్నీ ఈ ప్రభుత్వం ఆపివేయడం జరిగిందని అన్నారు. ఉద్యోగస్తులను కూడా ఈ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ ను అరెస్టుల ఆంధ్రగా మార్చారని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ పరిణామాలన్నీ గ్రహించి జూన్ 4వ తేదీన జరగబోయే వెన్నుపోటు దినం కార్యక్రమంలో ప్రభుత్వం దిగివచ్చేలా సాలూరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రజలు రైతులు, మహిళలు, విద్యార్థులు, సామాజిక వేత్తలు ప ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్లు గిరి రఘు, సాలూరు వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, పాచిపెంట వైయస్సార్ పార్టీ మండల అధ్యక్షుడు గొట్టాపు ముత్యాల నాయుడు, దండి శ్రీనివాసరావు, ఎమ్మెస్ నారాయణ, పిరిడి రామకృష్ణ, హరి బాలాజీ, మేకల శంకర్రావు వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. (Story:వెన్నుపోటు దినం విజయవంతం చేద్దాం)

