రేషన్‌పై బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు
వినుకొండ, రవ్వారంలో రేషన్ పంపిణీలో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ, మక్కెన
న్యూస్ తెలుగు/వినుకొండ : పేద ప్రజలకు మేలు చేసేలా ఇకపై రాష్ట్రంలోని రేషన్ దుకాణాల్లో బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు, అవసరమైన సమయాల్లో ఇతర నిత్యావసరాలు కూడా రాయితీపై అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. కొత్త కార్డుల కోసమైనా, మార్పుల కోసమైనా చివరి తేదీ ఏం లేదని, ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. వినుకొండ సట్టు బజారు, నూజండ్ల మండలం రవ్వారంలో ఆదివారం జరిగిన రేషన్ పంపిణీ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, డీసీసీబీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. రేషన్ దుకాణాలను ప్రారంభించి లబ్ధిదారులకు బియ్యం, పంచదార పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ ఇదే పని గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ వ్యాన్‌ల పేరుతో కాకినాడ పోర్టుకు బియ్యం స్మగ్లింగ్ చేశారు. తప్ప ప్రజల అవసరాలు గు ర్తించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. జగన్ రెడ్డి తెచ్చిన రేషన్ వాహనాల కారణంగా ప్రభుత్వానికి నెలకు రూ.1,800 కోట్లు, ఏడాదికి రూ.21,600 కోట్ల ఖర్చు అవుతుందన్నారు. ఇకపై వ్యాన్ కోసం ఎదురుచూడటం, వీధి చివర నుంచోవటం, సెలవులు పెట్టి అదెప్పుడు వస్తుందా? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి అవసరం లేదన్నారు. బియ్యం రవాణా వాహనాలపై లబ్దిదారుల్లో తీవ్ర అసంతృప్తిని గుర్తించే సీఎం చంద్రబాబు వాటిని తొలగించారన్నారు. పైగా నెలకు 2 రోజులే నిత్యావసరాలు ఇచ్చే వ్యవస్థను రద్దు చేసి ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లోనూ ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ దుకాణాలకు వెళ్లి సరకులు తెచ్చుకునే విధంగా చర్యలు చేపట్టారన్నారు. రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ డిపోలన్నీ తెరిచే ఉంటాయన్నారు. దోపిడీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయడమే తమ లక్ష్యమని, ప్రభుత్వం తరఫున చేసే ప్రతి పని, ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రజలకు గరిష్ఠ ప్రయోజనం చేకూర్చాలన్నదే సీఎం చంద్రబాబు ఏకైక ఆశయమని పేర్కొన్నారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు రేషన్ డీలర్లే వారి ఇళ్లకు వెళ్లి నిత్యావసరాలు అందిస్తారన్నారు. సీఎం చంద్రబాబు మరో కీలక సంస్కరణ తెస్తున్నారని, బియ్యం కావాలంటే బియ్యం, డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకునే మార్పు రాబోతుందని తెలిపారు. సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని ప్రజలంతా అభినందించడంతో పాటు హర్షిస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షలమంది రేషన్ కార్డుదారులకు న్యాయం చేయడమే తమ లక్ష్యమన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ డాక్టర్ దాస్తగిరి షకీలా. టిడిపి పట్టణ అధ్యక్షులు పి అయుబ్ ఖాన్. షమీం. కూటమి నేతలు. రాయల్ నాగ శ్రీను. జానీ. తాసిల్దార్ సురేష్ నాయక్. డిటి మురళి. ఆర్ ఐ శ్రీహరి. డీలర్ సంగమేశ్వర రావు. తదితరులు పాల్గొన్నారు.(Story : రేషన్‌పై బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు )

