యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం
న్యూస్ తెలుగు/వినుకొండ : స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్బంగా బుధవారం గుమ్మడి ఆశ్రమంలో కళాకారులకు, స్వచ్చంద సేవ సంస్థలకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా గత మూడు సంవత్సరాలుగా యంగ్ స్టార్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినందుకు ఫౌండేషన్ సభ్యులను అభినందిస్తూ వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారి సేవాలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధాశ్రమానికి రైస్ బ్యాగ్,కందిపప్పు బ్యాగు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పమిడిపల్లి అనిల్, సభ్యులు కడియం సునీల్,గుమ్మడి వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు గుమ్మడి వెంకటేశ్వర్లు మరియు మరికొన్ని సేవా సంస్థల వ్యవస్థాపకులు, మరి కొంతమంది నాటక కళాకారులు పాల్గొన్నారు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు.(Story :యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం )

