Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌మనదేశంలో 100 వసంతాల ఎర్రజెండా చరిత్ర పోరాటాలమయం

మనదేశంలో 100 వసంతాల ఎర్రజెండా చరిత్ర పోరాటాలమయం

మనదేశంలో 100 వసంతాల ఎర్రజెండా చరిత్ర పోరాటాలమయం

మారుతి వరప్రసాద్ సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి

న్యూస్ తెలుగు/వినుకొండ  : భారతదేశ స్వాతంత్య్రం పూర్వం, అనంతరం వంద సంవత్సరాల భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ఎర్రజెండా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కార్మిక కర్షక పేద వర్గాల హక్కుల కోసం పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించిందని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వర ప్రసాద్ అన్నారు. శనివారం నాడు వినుకొండ మండలం నాగిరెడ్డి పల్లె గ్రామ సిపిఐ శాఖ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ. భూమికోసం భుక్తి కోసం బడుగు జీవుల విముక్తి కోసం ఎర్రజెండా ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసిందని బాంచన్ దొర నీ కాల్ మొక్తా దొర అంటూ దొరల భూస్వాముల కబంధహస్తాల్లో చిక్కుకున్న లక్షలాది కుటుంబాలకు విముక్తి కలిగించిందని ఆయన అన్నారు. సెంటు కుంట లేని నిరుపేద రైతులకు పేద ప్రజలకు లక్షలాది ఎకరాల భూములను, ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిందని అన్నారు. ఈ దేశంలో పోరాడకుండా ఏదీ సాధించబడలేదని అధికారం లో ఎవరున్నప్పటికిని ప్రజల హక్కుల కోసం సిపిఐ రాజీలేని పోరాటాలు నిర్వహించిందన్నారు. మూడు సంవత్సరాలకు ఒకసారి శాఖల నుండి జాతీయ పార్టీ వరకు జరుగనున్న మహాసభలు షెడ్యూల్ జాతీయ పార్టీ ప్రకటించినందున మన జిల్లాలో గ్రామ శాఖల నుండి మండల పట్టణ నియోజకవర్గ మహాసభలను పూర్తిచేసుకుని జిల్లా మహాసభలు జరుపుకోవలసి ఉందన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ శాఖలో మంచి నాయకత్వాన్ని ఎన్నుకొని మండల పార్టీ పటిష్టతకు పాటుపడాలని కోరారు. మహాసభలో ఇంకా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజల పక్షాన పోరాడుతుందని ఇళ్ల స్థలాలు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు రేషన్ కార్డులు వృద్ధులకు వితంతువులు వికలాంగులకు పెన్షన్లు మంజూరు చేయాలని అనేక ధర్నా కార్యక్రమాలు పోరాటాలు చేస్తున్నామని నాగిరెడ్డిపల్లె ప్రాంత ప్రజల సమస్యలపై వినుకొండ మండల శాఖ కచ్చితంగా పోరాడి సమస్యలు పరిష్కరిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ శావల్యాపురం మండలం కార్యదర్శి రాయబారం వందనం, బొల్లాపల్లి మండల కార్యదర్శి పిన్నబోయిన వెంకటేశ్వర్లు, షేక్ చిన్న సుభాని, మరియ బాబు తదితరులు పాల్గొనగా మహాసభ నాగిరెడ్డిపల్లె గ్రామ శాఖ కార్యదర్శిగా దారివేముల మరియ బాబును మరి ఆరుగురిని కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.(Story : మనదేశంలో 100 వసంతాల ఎర్రజెండా చరిత్ర పోరాటాలమయం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments