జాతీయ స్థాయి ఎన్ పి టి ఈ ఎల్ పరీక్షలో టాప్ టాప్ వన్ లో నిలిచిన సీతం విద్యార్థిని ఎం. త్రివేణి
న్యూస్ తెలుగు/విజయనగరం : సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (సీతం) సంస్థలో బి.టెక్ (సీఎస్‌ఈ) చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఎం. త్రివేణి, ఐఐటి ఖరగ్‌పూర్ నిర్వహించిన జాతీయ స్థాయి ఎన్ పి టి ఈ ఎల్ ఆన్‌లైన్ సర్టిఫికేషన్ పరీక్షలో టాప్ 1లో నిలిచినందుకు కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు , విద్యార్థులు హృదయపూర్వక అభినందనలు తెలిప్పారు.
త్రివేణి మానవ వనరుల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రోగ్రామింగ్ ఇన్ జావా” కోర్సును 92% సమగ్ర స్కోర్ తో విజయవంతంగా పూర్తి చేశారన్నారు. దేశవ్యాప్తంగా 16040 మంది పరీక్షలలో ఉత్తీర్ణత పొందినవారిలో ఆమె టాప్ 1లో నిలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఈ అపూర్వమైన విజయము ఆమె విద్యలో చూపిన నిబద్ధత, సాంకేతిక నైపుణ్యం, గట్టి పట్టుదలకి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఈమెను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలన్నారు .ఈ గొప్ప విజయాన్ని పురస్కరించుకొని, కళాశాల డైరెక్టర్ డా. ఎం. శశిభూషణ రావు , ప్రిన్సిపాల్ డా. డి.వి. రామమూర్తి , కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డా. వేణుమాధవ్, అధ్యాపకలు మరియు విద్యార్థులు త్రివేణి నీ అభినందించి, ఆమె భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలు సాదించి ఎంతో ఉన్నత స్థాయి లో ఉండాలని ఆకాంక్షించారు.(Story : జాతీయ స్థాయి ఎన్ పి టి ఈ ఎల్ పరీక్షలో టాప్ టాప్ వన్ లో నిలిచిన సీతం విద్యార్థిని ఎం. త్రివేణి )

