గిరిజన ఇంటి నిర్మాణానికి జే కేసి టి ఆధ్వర్యంలో సిమెంటు రేకులు ఇనుప పైపులు వితరణ
న్యూస్ తెలుగు / చింతూరు : మండలంలోని ఏజి కోడేరు పంచాయతీ ఉలుమూరు గ్రామానికి చెందిన పులి భద్రమ్మ అనే గిరిజన మహిళ ఇల్లు గత వరదల ధాటికి కొట్టుకుపోవడంతో నిరాసురాలైనది. ఈ క్రమంలో బాధిత మహిళ ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జెకె సిటీ ట్రస్ట్ చైర్మన్ ఎండి జమాల్ ఖాన్ ను సంప్రదించి ఇంటి నిర్మాణానికి సహాయం అర్జించినది. మహిళా పరిస్థితిని గుర్తించి గురువారం భద్రమ్మ ఇంటి నిర్మాణానికి కావలసిన ఇనుప పైపులు సిమెంటు రేకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెకె సీ .టిట్రస్ట్ సభ్యులు రసూల్, రమణయ్య, జాన్ ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.(Story : గిరిజన ఇంటి నిర్మాణానికి జే కేసి టి ఆధ్వర్యంలో సిమెంటు రేకులు ఇనుప పైపులు వితరణ

