Homeవార్తలు '#Sharwa38' క్రూషియల్ రోల్ లో డింపుల్ హయాతి

 ‘#Sharwa38’ క్రూషియల్ రోల్ లో డింపుల్ హయాతి

 ‘#Sharwa38’ క్రూషియల్ రోల్ లో డింపుల్ హయాతి

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా: చార్మింగ్ స్టార్ శర్వా తన మేడిన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #Sharwa38ని ప్రారంభించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కొలాబరేషన్ శర్వా, దర్శకుడు సంపత్ నంది ఇద్దరికీ ఒక ముఖ్యమైన మైల్ స్టోన్ ని చూస్తోంది. ఈ గ్రిప్పింగ్, హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తారు. ఈ చిత్రం హైబడ్జెట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతుంది. ప్రీ-ప్రొడక్షన్ విషయంలో కూడా టీం చాలా జాగ్రత్తలు తీసుకుంది.

ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా అనౌన్స్ చేసిన తర్వాత, మేకర్స్ ఇప్పుడు క్రూషియాల్ పాత్ర కోసం డింపుల్ హయాతిని ఎంపిక చేశారు, ఇది ప్రాజెక్ట్ కు మరింత స్టార్ పవర్ ని యాడ్ చేసింది. కథలో ఇంపాక్ట్ ఫుల్ క్రూషియాల్ ని డింపుల్ పోషించనుంది. ఈ పవర్ ఫుల్ పాత్రకు ప్రాణం పోసేందుకు డింపుల్ పర్ఫెక్ట్ చాయిస్.

అనుపమ, డింపుల్ ఇద్దరూ ఇంపాక్ట్ ఫుల్ రోల్స్ పోషిస్తున్నారు. అనుపమ పోస్టర్ ఒక బోల్డ్ ట్రాన్స్ ఫర్మేషన్ చుసిస్తోంది. డింపుల్ పాత్ర కూడా ఇంటెన్స్ ఎనర్జీ వుంది. ఆమె ముఖం కనిపించకపోయినా, మెడ, ముక్కు, చెవులు, చేతులు, వేళ్లపై బంగారు ఆభరణాలతో వుండటం ఆసక్తికరంగా వుంది.

1960లో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో సెట్ చేయబడిన #Sharwa38 ప్రేక్షకులను మరపురాని అనుభూతిని అందించబోతోంది. ఈ చిత్రం హై-స్టేక్స్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది.

#Sharwa38 కి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తుండగా సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్‌ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: కేకే రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
సమర్పణ : లక్ష్మీ రాధామోహన్
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
PRO: వంశీ-శేఖర్ (Story: ‘#Sharwa38’ క్రూషియల్ రోల్ లో డింపుల్ హయాతి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!