రేషన్ సరఫరా సకాలంలో జరగాలి..
– పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదు
– అక్రమాలకు పాల్పడితే డీలర్షిప్ తొలగిస్తాం
– ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ హెచ్చరిక

న్యూస్ తెలుగు / వినుకొండ :రేషన్ సరఫరాలో అక్రమాలు జరిగిన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన చర్యలు తప్పవని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జివీ ఆంజనేయులు హెచ్చరించారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో సోమవారం జరిగిన వినుకొండ నియోజకవర్గం రేషన్ డీలర్ల సమావేశానికి చీఫ్ విప్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌక డిపో దుకాణాల ద్వారా ప్రతినెల సకాలంలో రేషన్ ప్రజలకు సరఫరా చేయాలని సూచించారు. రేషన్ పంపిణీలో అవకతవకలు అక్రమాలకు పాల్పడితే ఆయా రేషన్ షాప్ ల లైసెన్సులను తొలగించడం జరుగుతుందని హెచ్చరించారు. పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదని, ఏ పార్టీ వారైనా, ఎంతటి వారైనా సరే చర్యలు తప్ప వన్నారు. ఎండియు వాహనాల నిర్వాహకుల సమస్యలు ఏమైనా ఉంటే తాసిల్దారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రేషన్ సరఫరా విషయంలో కొందరు నిర్లక్ష్యాన్ని వీడి ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా హెచ్చరించడం జరిగిందని, విధివిధానాల్లో మార్పు లేకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. రేషన్ సరఫరా సక్రమంగా జరగకపోతే అధికారులకు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, అటువంటి పరిస్థితికి కారణమైన వారిని సహించేది లేదన్నారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో రాష్ట్ర ఆర్థిక ప్రగతి సర్వనాశనమైందని, ఎన్డీఏ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక ప్రగతి పరుగులు తీస్తుందన్నారు. నియోజవర్గంలోని రేషన్ డీలర్లు అందరూ ప్రభుత్వానికి సహకరించి నిబంధనల ప్రకారం ప్రతినెల రేషన్ సలపర సకాలంలో ప్రజలకు సరఫరా చేయాలని తెలిపారు. సమావేశంలో ఐదు మండలాల తాసిల్దారులు, రెవిన్యూ అధికారులు, రేషన్ షాప్ డీలర్లు పాల్గొన్నారు. (Story:రేషన్ సరఫరా సకాలంలో జరగాలి..)

