ఉగ్రదాడులకు నిరసనగా బిజెపి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
న్యూస్ తెలుగు / వినుకొండ : కాశ్మీర్లో లోని పహాల్గం జరిగిన ఉగ్రదాడులకు నిరసనగా వినుకొండ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి యుత నిరసన ర్యాలీ నిర్వహించారు ..ఉగ్ర మూకల చేతిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు శశి కుమార్ ,మరియు నియోజకవర్గ బిజెపి అధ్యక్షులు యార్లగడ్డ లెనిన్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని బిజెపి పార్టీ ఆఫీసు నుండి పట్టణపురవీధులు నందు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు సుధాకర్ ,మేడమ్ రమేష్ మరియు నియోజకవర్గ బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుధా, గణేష్, దాసు, లక్ష్మీనారాయణ, ఎం.వి అప్పారావు, లాయర్ చంద్రమోహన్, నారిశెట్టి మహేష్, పత్తి మణికంఠ, గోడవర్తి సుజాత, కవలకుంట జాన్ బాబు, గట్టుపల్లి శ్రీను, నాసరయ్య, సెట్టి హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు. (Story: ఉగ్రదాడులకు నిరసనగా బిజెపి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ)