వేసవి చిత్రకళా తరగతులు
న్యూస్ తెలుగు / వినుకొండ : జెస్టిస్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ జయతి హాస్పిటల్ ప్రక్కన యుటిఎఫ్ ఆఫీస్ నందు వినుకొండ డివిజన్ వారి సహకారంతో వేసవి చిత్రకళా తరగతులు ఈనెల 28 నుండి పది రోజుల పాటు ప్రతి రోజూ ఉదయం 7 :30 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు విద్యార్థినీ విద్యార్థులకు డ్రాయింగ్, పెయింటింగ్ లలో క్లాసులు జరుగుతాయని, పాల్గొనే వారికి ఆర్ట్ మెటీరియల్ ప్యాక్ అందిస్తామని, క్లాసుల తదనంతరం అందరికీ బెస్ట్ పార్టిసిపెంట్ సర్టిఫికెట్స్, బాగా గీసిన వారికి తరగతుల చివరి రోజున ప్రధమ, ద్వితీయ తృతీయ బహుమతులు పుర ప్రముఖుల ద్వారా అందజేయడం జరుగుతుందని, ఎంట్రీ ఫీజు,తదితర మరిన్ని వివరాలకు ఈ సెల్ ఫోన్ నెంబర్ 9848469694 ను సంప్రదించాలని అకాడమీ డైరెక్టర్ ప్రముఖ చిత్రకారుడు వజ్రగిరి జెస్టిస్ తెలిపారు. (Story:వేసవి చిత్రకళా తరగతులు)