Homeవార్తలు మే 1‘బ్రొమాన్స్’

 మే 1‘బ్రొమాన్స్’

 మే 1‘బ్రొమాన్స్’

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా : ఇటీవల థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన హాస్యభరిత చిత్రం ‘బ్రొమాన్స్’ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ మాధ్యమం సోనీ లివ్‌లో మే 1 నుంచి సోనీ లివ్‌లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది. హాస్యం, యాక్షన్, డ్రామా, స్నేహంపై , హృదయాన్ని హత్తుకునే భావోద్వేగ సన్నివేశాలతో ఈ మలయాళ సినిమా తెరకెక్కింది. థియేటర్స్‌లో ఈ సినిమాను చూడలేకపోయినవారు ఆ మ్యాజిక్‌ను ఇప్పుడు మీ ఇంట్లోనే చూసి ఆస్వాదించవచ్చు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అరుణ్ డి.జోస్ మాట్లాడుతూ ‘‘బ్రొమాన్స్’ చిత్రాన్థ్ని థియేటర్స్‌లో వీక్షించి తమ ప్రేమాభిమానాలను అందించిన ప్రేక్షకులను ఎప్పటికీ మరచిపోలేను.   ఇది అందరి హృదయాలను హత్తుకున్న ఫ్రెండ్ షిప్ స్టోరి. చక్కటి డ్రామా, సస్పెన్స్ వంటి చాలా ఎలిమెంట్స్‌ను ఇందులో మనం చూడొచ్చు. అందుకనే ప్రేక్షకులకు సినిమా ఎంతగానో నచ్చింది. కనిపించకుండా పోయిన ఓ స్నేహితుడిని వెతికే స్నేహితుల కథ. మే 1నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుండం ఆనందంగా ఉంది. దీంతో ఈ చిత్రం మరింత మంది పేక్షకుల హృదయాలను ఆకట్టుకుంటుందనటంలో సందేహం లేదు’’ అన్నారు.

అరుణ్ డి.జోస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రొమాన్స్’ చిత్రం బింటో అనే యువకుడి కోణంలో కథ నడుస్తుంది. అతను తన సోదరుడి స్నేహితులతో కలిసి కనిపించకుండా పోయిన తన సోదరుడిని వెతకటానికి ప్రయత్నిస్తాడు. కథంతా ఓ రాత్రిలోనే జరుగుతుంది. ఊహించని ట్విస్టులు, మరచిపోలేని జ్ఞాపకాలతో నిండిన ప్రయాణంగా అందరినీ సినిమా మెప్పిస్తుంది. అరుణ్ డి.జోస్, రవీష్ నాథ్, థామస్ పి.సెబాస్టియన్ రాసిన ఈ కథను అషిక్ ఉస్మాన్ నిర్మించారు. ఇందులో  అర్జున్ అశోకన్, భరత్ బోపన్న, శ్యామ్ మోహన్, మహిమ నంబియార్, మాథ్యూ థామస్, కలభవన్ షాజోన్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు నటించారు.(Story: మే 1‘బ్రొమాన్స్’)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!