సాలూరు ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
న్యూస్ తెలుగు/సాలూరు : ప్రజల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్
స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. బుధవారం సాలూరు ఎంపీడీవో కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎండిఓ జి పార్వతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ రాష్ట్రంలోని సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నామని అన్నారు.
పల్లె ప్రగతి, హరిత హారం, నీటి సరఫరా, పింఛన్లు, గృహ నిర్మాణం, విద్యుత్, పాఠశాలల ఆధునీకరణపై దృష్టి సారించాలని తెలిపారు.ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించే వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచన ఇచ్చారు.అధికారులకు సమన్వయం, పనుల నాణ్యతపై పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు.ప్రాధాన్యతా ప్రాజెక్టులకు కార్యాచరణ రూపకల్పనపై దృష్టి సారించాలని తెలిపారు.ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రమణ. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పరమేష్. ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, ఐటీడీఏ, ఎన్ఆర్ఈజీఎస్, గృహ నిర్మాణ శాఖ మండల అధికారులు పాల్గొన్నారు. (Story:సాలూరు ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలి)