వైసీపీ మండల కన్వీనర్ల నియామకం
న్యూస్ తెలుగు / వినుకొండ : మాజీ ముఖ్యమంత్రి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయ సాధనకై వినుకొండ నియోజకవర్గం నందు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తీసుకురావడానికి వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గం లోని ఐదు మండలాలు మరియు వినుకొండ మునిసిపాలిటీ కి పార్టీ కన్వినర్లను నియమించడం జరిగింది. నియమితులైన పార్టీ కన్వీనర్లు వినుకొండ మునిసిపాలిటి కొత్తమాసు వెంకట సాంబశివరావు, వినుకొండ రూరల్ దండు చెన్నయ్య, నూజండ్ల ముప్పురాజు వెంకటేశ్వర్లు, కొండవర్జు నాగేశ్వరరావు, కాకర్ల పెద్ద నారాయణ రెడ్డి, బోడెపూడి వెంకటేశ్వర్లు (కొండలు) మండల కన్వినర్లు గా నియమితులైన వారు వారి మండలాలో ,నియోజకవర్గ స్తాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలనీ నియోజకవర్గ సమన్వయకర్త కి మరియు గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలకు మద్య వారధిల పనిచేస్తూ, సమన్వయకర్త ఆదేశాలను తూచాతప్పకుండా నాయకులకు, కార్యకర్తలకు చేరవేస్తూ , గ్రామ స్తాయిలో కార్యకర్తల సమస్యలు, పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలును ఎప్పటికప్పుడు సమన్వయకర్తకి తెలియజేయాలని కోరారు. (Story:వైసీపీ మండల కన్వీనర్ల నియామకం)