జడ్పీ స్కూల్ బాలికలకు అభినందన సభ
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షా ఫలితాలలో మొత్తం విద్యార్థినీలు 221 హాజరు కాగా ఉత్తీర్ణులైన వారు 196 మంది ఉత్తీర్ణత శాతం 89%. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థినిలకు అభినందన సభ ఏర్పాటు చేసి 600 మార్కులకు 591 మార్కులు స్కూలు ఫస్ట్ వచ్చిన వి. చాతుర్వ, 600 గాను 591 మార్కులు జె. ఖతిజా వీరిని ప్రధానోపాధ్యాయురాలు కే.నాగలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు వీరిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జి. శ్రీనివాసరావు, ఎంఈఓ జఫరుల్లా అభినందించారు. విద్యార్థిని తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలిపారు. (Story:జడ్పీ స్కూల్ బాలికలకు అభినందన సభ)