భూ భారతి తో 30 రోజుల్లో భూ సమస్యల పరిష్కారం
న్యూస్తెలుగు/వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టంతో భూ సంభంధిత సమస్యలు 30 రోజుల్లో పరిష్కారం అవుతాయాని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ప్రతి రైతు భూమికి భూ దార్ కార్డులను ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్డులో భూమి కి సంభందించిన అన్ని వివరాలు నిక్షిప్తమై ఉంటాయన్నారు. మంగళవారం గోపాల్ పేట, రేవల్లి, ఏదుల మండలాలలో భూ భారతి చట్టం పై నిర్వహించిన అవగాహనా కార్యక్రమానికి అయన హాజరై మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో భూ సమస్యలను పరిష్కరించకపోగా 18 లక్షల ఎకరాలకు సంబంధించిన భూ దస్త్రాలను మాయం చేసి కాజేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు అదే వీటిని ప్రశ్నించిన రైతులపై కేసులు బనయించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నేడు అలాంటి ఇబ్బంది ఏమీ లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వీఆర్వో వ్యవస్థ గ్రామాలలో భూ ఆక్రమణలకు పాల్పడేందుకు ఇబ్బందులు అవుతాయని గ్రహించిన గత పాలకులు విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం జరిగిందన్నారు
నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించబోతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిరుపేదలు సైతం ఎమ్మెల్యే, ఎంపీ , ముఖ్యమంత్రి మంత్రులు తినే భోజనాన్ని తినాలన్న ఉద్దేశంతో ప్రతి ఇంటికి సన్నబియ్యం పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో నేడు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. గ్రామస్థాయిలోని నిరుపేద విద్యార్థులకు సైతం ఉన్నత విద్యను అందించేందుకు ప్రతి మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్బులను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అన్నదాతలు పండించిన వరి పంటను చివరికించే వరకు కొనుగోలు చేసేందుకు ప్రతి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని దళారుల మాటలు నమ్మకుండా కొనుగోలు కేంద్రాలలోనే వారి ధాన్యాన్ని విక్రయించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జాయింట్ కలెక్టర్ యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ఆయా మండలాల తాసిల్దారులు, గోపాల్పేట ఉమ్మడి మండలం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సత్యసిల్లారెడ్డి రేవల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పర్వతాలు, శివన్న సురేష్ గౌడ్, సురేందర్, సుఖేందర్ రెడ్డి, జానకి రాముడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story:భూ భారతి తో 30 రోజుల్లో భూ సమస్యల పరిష్కారం)