పలు శుభకార్యలలో పాల్గొన్న మాజీ మంత్రి
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణంలో గాంధీ చౌక్ లో బీ ఆర్ యస్ పార్టీ నాయకులు రంగపురం శివారెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన జ్యువెలరీ షాపును ప్రారంభించిన మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రంగపురం శివారెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు. వనపర్తి పట్టణం 21 వ వార్డుకు చెందిన బీ ఆర్ యస్ పార్టీ నాయకులు. డానియల్ మనుమరాలు పుట్టు చీర కార్యక్రమంలో పాల్గొన మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చిన్నారిని ఆశీర్వదించడం జరిగింది. కొత్తకోట ఆనంద్ కన్వెన్షన్ లో జరిగిన భరత్ కుమార్ రెడ్డి & శ్రీ మాధవి వివాహానికి హాజరైన మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి వెంట గట్టు యాదవ్ పలుస రమేష్ గౌడ్ , బండారు కృష్ణ, లక్ష్మీనారాయణ ,సూర్యవంశం గిరి తదితరులు పాల్గొన్నారు.(Story : పలు శుభకార్యలలో పాల్గొన్న మాజీ మంత్రి )