అంబేడ్కర్ ఆదర్శప్రాయుడు
-అంబేడ్కర్ కు ఘన నివాళి
-నివాళులర్పించిన అధికార, విపక్ష, ప్రజా సంఘాల నాయకులు
న్యూస్ తెలుగు/ సిద్దిపేట జిల్లా ప్రతినిధి : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సమసమాజ స్థాపనకు ఎంతో కృషి చేశారని ఆయన జీవితం ఆదర్శనీయమని అక్కన్నపేట కాంగ్రెస్, బీజేపీ పార్టీల మండలాధ్యక్షులు జంగపెళ్లి అయిలయ్య, రామంచ మహేందర్ రెడ్డి అన్నారు.అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడంలోనూ ఆయన పాత్ర శ్లాఘనీయమని కొనియాడారు.ప్రాథమిక హక్కులు, సమానత్వం కోసం ఆయన ఎనలేని కృషి చేశారని చెప్పారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల వ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సంధర్భంగా అధికార, విపక్ష, ప్రజా, కుల, విద్యార్థి సంఘాలు ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు.మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.మహనీయుడి జయంతి సందర్భంగా మండల కేంద్రంతో పాటుగా కట్కూర్, జనగామ, చౌటపల్లి తదితర గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
Dr. B.R. Ambedkar, a champion of social equality, has been hailed as an ideal figure by leaders from various parties. On the occasion of his birth anniversary, officials, opposition leaders, and public figures paid their respects to him.
Tributes to Dr. Ambedkar
– Akkannapet Mandal Congress and BJP presidents, Jangapeyali Ailayya and Ramanch Mahender Reddy, praised Dr. Ambedkar’s efforts in establishing a society free of discrimination, calling his life inspirational.
– They lauded his role in securing reservations for marginalized communities and his tireless work towards ensuring fundamental rights and equality.
– Across Siddipet district’s Akkannapet Mandal, various organizations, including ruling party, opposition, public, caste, and student groups, paid homage to Dr. Ambedkar’s statue.
Celebrations
– In government offices, officials offered floral tributes to Dr. Ambedkar’s portrait, marking his birth anniversary.
– In Akkannapet Mandal and surrounding villages like Katkoor, Janagam, and Chowtapally, community members organized ‘annadanam’ (free meal) programs to commemorate the occasion.
– Source By :
– Special Correspondent Naradas Eshwar – Senior Journalist News Telugu
Contact- 8008170312 (Story : అంబేడ్కర్ ఆదర్శప్రాయుడు)