అంబేడ్కర్ ఆశయసాధనకు కృషి
కట్కూరు అంబేడ్కర్ గ్రామ శాఖ అధ్యక్షుడు కోడముంజ బాలరాజు
న్యూస్ తెలుగు/ సిద్దిపేట జిల్లా ప్రతినిధి: డా.బీఆర్ అంబేడ్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప మహనీయుడని, ప్రతిఒక్కరూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెల్లేలా కృషి చేయాలని కట్కూరు అంబేడ్కర్ గ్రామ శాఖ అధ్యక్షుడు కోడముంజ బాలరాజు అన్నారు. కట్కూరు గ్రామంలో గ్రామ తాజా మాజీ ప్రజా ప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదకుటుంబంలో పుట్టిన అంబేడ్కర్ కష్ట పడి ఉన్నత విద్యను అభ్యసించడమే కాకుండా తన విజ్ఞానాన్ని సమాజం అభివృద్ధికి, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు సంక్షేమాభివృద్ధికి కృషి చేశారన్నారు. కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు జిల్లెల అశోక్ రెడ్డి,కట్కూరు ప్యాక్స్ చైర్మెన్ పంజా రాజయ్య,ఉల్లెంగుల రాజు,సురేష్ తదితరులు పాల్గొన్నారు. (Story : అంబేడ్కర్ ఆశయసాధనకు కృషి )
ప్రత్యేక కథనం: నారదాసు ఈశ్వర్
(సీనియర్ జర్నలిస్ట్)