1.25 కోట్లతో నిర్మించిన రహదారులు ప్రారంభం
న్యూస్ తెలుగు/ సాలూరు : ప్రజలకు మెరుగైన రహదారుల సౌకర్యం కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సోమవారం పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలం: తోణాం పంచాయతీ సిమిడివలస – కొత్తూరు రహదారి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మొదట గ్రామస్తులు పూర్ణ కుంభం తో మంత్రికి స్వాగతం పలికారు. అనంత1.25 కోట్లు (125 లక్షల రూపాయలు) వ్యయంతో నిర్మించిన సిమిడివలస – కొత్తూరు రహదారినీ ప్రారంభించారు. ఈ ఆమె మాట్లాడుతూ ఈ రహదారి నిర్మాణం పూర్తి కావడంతో గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగనుంది. విద్య, వైద్యం, వ్యవసాయం, వాణిజ్య రంగాల్లో అభివృద్ధికి ఇది దోహదపడనుందనీ అన్నారు. గిరిజన గ్రామాల్లో రహదారులు కల్పిస్తున్నందుకు
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు., గ్రామ అభివృద్ధికి నిరంతరంగా కృషి చేస్తానని తెలిపారు.రహదారి నిర్మాణానికి మద్దతు అందించినందుకు మంత్రికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సాలూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పరమేష్ సర్పంచ్ మువ్వల అదియ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు రొంపల్లి రజిని. సాలూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, సాలూరు ఎండిఓ గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువత, మహిళా తదితరులు పాల్గొన్నారు. (Story : 1.25 కోట్లతో నిర్మించిన రహదారులు ప్రారంభం)