Homeవార్తలుతెలంగాణబిజెపి ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రచారాందోళన

బిజెపి ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రచారాందోళన

బిజెపి ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రచారాందోళన

తిరుమలేశుని సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని మోసం చేసిన బీజేపీ.

రైతులకు మూడు నల్ల చట్టాలు రద్దు చేస్తానని, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర చట్టం చేస్తానని మోసం చేసిన బీజేపీ.

అమరావతిని ఢిల్లీని తలదాన్నే రాజధానిని చేస్తానని మోసం చేసిన బీజేపీ.

దేశంలో వంద రోజుల్లో అధిక ధరలు తగ్గిస్తానని దేశ ప్రజలను మోసం చేసిన బిజెపి.

విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయబోము అని ప్రకటన చేయలేని బిజెపి. ఫ్యాక్టరీ కి సొంత గనులు ఇవ్వలేని బిజెపి.

న్యూస్ తెలుగు/వినుకొండ  : దేశంలోనూ మన రాష్ట్రంలోనూ బిజెపి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడిచినప్పటికిని ఈ దేశానికి మన రాష్ట్రానికి వరగబెట్టిందేమీ లేదని దేశం యావత్తు అప్పుల ఊబిలో కూరుకొని పోయిందని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక మతోన్మాద విధానాలపై విస్తృత ప్రచారం గావిస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ వినుకొండ పట్టణంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కేంద్రం లోని పెద్దలు 2014 ఎన్నికలలో బిజెపి అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని, అమరావతిని ఢిల్లీని తలదన్నే రాజధానిని చేస్తానని, వెనుకబడ్డ జిల్లాలకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తానని, కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మిస్తానని, ఆరుకాలం శ్రమించి పంటలు పండించే రైతన్నకు మూడు నల్ల చట్టాలు రద్దుచేసి రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధరను చట్టబద్ధత చేస్తానని వ్రాత పూర్వకంగా హామీ ఇచ్చి నమ్మించి మోసం చేసిందని తను అధికారంలోకి వస్తే 100 రోజుల్లో అధిక ధరలు తగ్గిస్తానని దేశంలో సామాన్యుడు వాడుకునే నిత్యవసర సరుకుల ధరలు పెట్రోలు డీజీలు గ్యాస్ మోయలేని అధిక ధరల భారాలు మోపి ప్రజల నడ్డి విరిచారని ఆయన విమర్శించారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో మతోన్మాద పోకడలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల మానప్రాణాలకు రక్షణ కరువైపోయిందని దళిత మైనారిటీలపై హత్యలు దాడులు నిరంతరం కొనసాగుతున్నాయని వారి జీవితాలకి భద్రత లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. భారతదేశ స్వాతంత్రానికి కుల మతాల విచక్షణ లేకుండా ఈ దేశంలోని హిందువులు ముస్లింలు సిఖులు క్రిస్టియన్లు బుద్ధులు జైనులు ఇలా అనేక మతాల కులాల జాతుల ప్రజలు స్వాతంత్ర్యం కోసం పోరాడి తమ ప్రాణాలర్పించారని అటువంటి ప్రజలపై వివక్షత చూపటం హత్యలు అమానుషాలు కక్షలు కార్పన్యలతో హత్యకాండతో అనమనవీయంగా ప్రవర్తించటం దుర్మార్గమన్నారు. దీనికి రుజువే మణిపూర్ రాష్ట్ర ఘటనలు ఆ రాష్ట్రంలోని అధికారంలో ఉన్న బిజెపి మైటేయులు అనే అధికార పార్టీ తెగవారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మైనారిటీ వర్గీయులైన కుకీజాతుల వారిని 300 మందిని హతమార్చి మహిళలను వివస్త్రలుగా చేసి బహిరంగంగా ఊరేగించి వారిని అత్యంత దారుణంగా మానభంగం చేసినటువంటి పరిస్థితుల్లో కేంద్రంలోని బిజెపి పెద్దలు పెదవి విప్పి మాట్లాడలేనటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా అధికారాన్ని చలాయిస్తూ మైనారిటీ తెగలపై విరుచుకుపడుతున్నారు. బిజెపి అధికారంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా మైనారిటీలపై దారుణమైన హింసాకాండను కొనసాగిస్తూన్నారు. తమ చెప్పుచేతలలో లేని ప్రతిపక్ష రాజకీయ పార్టీలపై ఈడి, సిబిఐ వ్యవస్థలను ఉపయోగించుకొని వారిపై దాడులు నిర్వహించి వారిని జైళ్లలో వేసి భకంపితులను చేస్తున్నారు ఉదాహరణకు దేశంలోని పశ్చిమబెంగాల్, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీ ఆఫ్ పార్టీ వారిని తదితర బిజెపియేతర రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీల నాయకులను ఇబ్బందుల పాలు చేస్తూ వారు బిజెపి తీర్థం పుర్చుకుంటే పునీతులైపోతున్నట్లుగా వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు. కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించి దేశ ప్రజలకు సమర్పించిన రాజ్యాంగాన్ని సైతం మెజారిటీ పార్లమెంటు స్థానాలు వస్తే పూర్తిగా మార్చి వేస్తామని బిజెపి పెద్దలు అంటున్నారు ప్రజాస్వామ్యాన్ని కూల్చి వేయటానికి సిద్ధపడుతున్నారు అధ్యక్షతరహా పాలన చేయటానికి సాహసం చేయ పూనుకుంటున్నారు ఈ నేపథ్యంలో భారత దేశంలో ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ, వారి యొక్క సంస్థలు ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ శక్తులు.ఈ విధంగా దేశంలో నియంతృత్వంగా పరిపాలన నిర్వహిస్తూ తమకు అడ్డు లేదనే విధంగా శాశ్వతంగా దేశాన్ని వారే పరిపాలించాలనే దుష్ట తలంపుతో ఎన్నికల వ్యవస్థల్ని, రక్షణ, న్యాయవ్యవస్థలను సైతం రాజకీయాలకు ముడిపెట్టి ప్రజలను నయవంచన చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్మిక రైతు వ్యతిరేక మతోన్మాద విధానాలపై ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి రోజు మొదలుకొని ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వరకు ఈ ప్రచార యాత్రలు దేశవ్యాప్తంగా కొనసాగించాలని నిర్ణయించిన నేపథ్యంలో పట్టణాలలో గ్రామాలలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు మతోన్మాదం పట్ల జాగరుకులై మతసామరస్యం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం కంకణబద్ధులై పోరాటాలకు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు రాయబారం వందనం, పిన్ని బోయిన వెంకటేశ్వర్లు, ఎ. పవన్ కుమార్, షేక్ చిన సుభాని, తిరుమల శెట్టి,కె. మల్లికార్జున, షేక్ మస్తాన్, సోడాల సాంబయ్య, లక్ష్మీదేవి, జల్లి వెంకటేశ్వర్లు, పొట్లూరి వెంకటేశ్వర్లు, మరీయ బాబు, మరియమ్మ వెంకటయ్య రాములు తదితరులు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.(Story : బిజెపి ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రచారాందోళన )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!