సాలూరు లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు
న్యూస్ తెలుగు/ సాలూరు : తెలుగు ప్రజల అభివృద్ధి మరియు ఆత్మగౌరవానికి ప్రజల సంక్షేమానికి కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శనివారం సాలూరు పట్టణంలో 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మొదట పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి వెంకటేశ్వర డీలక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పార్టీ ఆఫీస్ వద్ద జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ నడిబొడ్లు లో జెండా ఎగరవేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పార్టీని స్థాపించి తొమ్మిది నెలలోనే అధికారంలోకి తీసుకువచ్చిన అన్న నందమూరి తారక రామారావును తెలుగు ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారని అన్నారు.గత ఐదేళ్ల అరాచక పాలన నుండి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించడంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అద్భుతమైన కృషిని అభినందించారు. ప్రజా సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు.
తెలుగు ప్రజల అభివృద్ధి మరియు ఆత్మగౌరవం కోసం 43 ఏళ్లుగా నిస్వార్థంగా సేవలందిస్తున్న తెలుగుదేశం పార్టీ, ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని పని చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ కోసం నిస్వార్థంగా సేవలందిస్తున్న 43 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గౌరవప్రదంగా సన్మానించారు. వారి అంకితభావాన్ని గుర్తించి, భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో నిమగ్నమయ్యేలా ఉండాలన్నారు. సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, అక్కడి రోగులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు, పేద మహిళలకు చీరలను అందజేశారు. ప్రజలకు సేవ చేయడమే నిజమైన రాజకీయ సేవ అని పేర్కొంటూ, ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజ్ దేవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పుట్టిందంటే దానికి కారణం పేదలు బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధికి కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో కోటి సభ్యత్వాలు తీసుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, మండల అధ్యక్షుడు పరమేశు, మక్కువ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గొల్ల వేణుగోపాల్ నాయుడు, మెంటాడ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చలుమూరు వెంకట్రావు. సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.(Story : సాలూరు లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు )