దళిత హక్కుల పోరాట సమితి పల్నాడు జిల్లా ప్రథమ మహాసభ
బలహీన వర్గాల హక్కుల కాపాడుటలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
కరువది సుబ్బారావు డి. హెచ్. పి. ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
న్యూస్ తెలుగు / వినుకొండ : దళిత బలహీన వర్గాల హక్కులు కాపాడుటలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరువది సుబ్బారావు ఆరోపించారు. శుక్రవారం నాడు వినుకొండ పట్టణంలోని శివయ్య భవన్లో జరిగిన దళిత హక్కుల పోరాట సమితి పల్నాడు జిల్లా ప్రధమ మహాసభకు హాజరై ఆయన ప్రసంగిస్తూ. దేశానికి స్వాతంత్రం సిద్ధించిన నాటి నుండి నేటి వరకు బలహీనవర్గాలు అణచబడుతూనే ఉన్నారని వారిలో దళితులు మరింత దయనీయ స్థితిలో ఉన్నారని ఆయన అన్నారు. దేశం లో ఉత్పత్తి అవుతున్న సంపదలో పేద బలహీన వర్గాలు కార్మికుల, కష్టజీవులు సృష్టిస్తున్న సంపదను రెక్కాడితే గాని డొక్కాడని శ్రమజీవులకు బడుగు బలహీన వర్గాలకు దళితులకు సమానంగా పంచబడటం లేదని ప్రశ్నించిన వారిని అధికారంలో ఉన్న వారి అణచి వేతలే వారికి బహుమతులుగా మిగిలిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల పుణ్యమా అని ఎన్నికలలో పదవులు రిజర్వేషన్ల ప్రకారం వస్తే అధికార పార్టీ నేతల కనుసైగలలో వారు నడుచుకోవలసి వస్తుందన, 78 సంవత్సరాల స్వాతంత్ర్య భారతదేశంలో బలహీన వర్గాలపై ఇంకా ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దళిత బలహీన మైనారిటీ వర్గాలపై దాడుల, అత్యాచారాలు, హత్యలు యధావిధిగా కొనసాగుతున్నాయని, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో యదేచ్ఛగా కొనసాగుతున్నాయని సంఘ్ పరివార్ శక్తుల అరాచకానికి అంతే లేకుండా పోయిందని ఆయన అన్నారు. సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ మాట్లాడుత. పల్నాడు జిల్లా ప్రాంతంలో పేద దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారి హక్కుల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నిరంతరం పోరాడుతూ వారి హక్కులను కాపాడుతుందని, జిల్లా దళిత హక్కుల పోరాట సమితి మహాసభలో జిల్లా కమిటీ నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని దళితుల సమస్యలపై పోరాటాల్లో ముందు ఉండాలని వారికి ఎర్రజెండా ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. సభ కార్యక్రమానికి రాయబారం వందనం అధ్యక్షత వహించగా కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పిన్ని బోయిన వెంకటేశ్వర్లు, పవన్ కుమార్, చౌటుపల్లి నాగేశ్వరరావు, బొంత నాగేశ్వరరావు, సోమవారపు దావీదు, ధూపాటి మార్కు, మరి దాసు,సోడాల సాంబయ్య, మస్తాన్, ఇపర్ల వెంకటేశ్వర్లు, పౌలు, వెంకట్రావు, అభిషేకం తదితరులు పాల్గొన్నారు. (Story : దళిత హక్కుల పోరాట సమితి పల్నాడు జిల్లా ప్రథమ మహాసభ)