భాధ్యతతో పనిచేసి పదవులకు న్యాయం చేయాలి
అయ్యప్పస్వామి ఆలయ నూతన కమిటీని సన్మానించి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : శ్రీశ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి దేవాలయ నూతన కమిటీని గౌరవ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వగృహంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు ఏటేటా పెరుగుతూ ముఖ్యంగా యువత అధ్యాతికతవైపు ఆకర్షించడం హర్షించదగ్గ విషయం అని అన్నారు. గతములో ఆలయ అభివృద్ధి కోసం సహకరించామని రాబోవు కాలంలో అభివృద్ధికి సహకరిస్తానని అన్నారు.నూతన అధ్యక్షులు ముత్తుకృష్ణ గురుస్వామి,ప్రధాన కార్యదర్శి చీర్ల.కృష్ణసాగర్ గార్ల ఆధ్వర్యములో నూతన కమిటీ ఆలయ అభివృద్ధికోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,పట్టణ అధ్యక్షులు పలుస.రమేష్ గౌడ్, నందిమల్ల.అశోక్,లక్ష్మినారాయణ,బండారు.కృష్ణ, ఉంగ్లమ్. తిరుమల్,ప్రేమ్ నాథ్ రెడ్డి,చిట్యాల.రాము, జోహేబ్బ్ హుస్సేన్, మంద రాము సుబ్బు వడ్డే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. (Story : భాధ్యతతో పనిచేసి పదవులకు న్యాయం చేయాలి)