ఏపీ బడ్జెట్ అన్ని వర్గాల వారికి అనుకూలం
న్యూస్ తెలుగు /సాలూరు : ఆర్థికంగా ఇబ్బంది ఉన్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉందని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం ఆమె క్యాంపు కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తూ 3 లక్షల కోట్లు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టిందని అన్నారు.గత ప్రభుత్వంలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఎస్టీలకు 75,000, బీసీలకు 50,000 అదనంగా మంజూరు చేస్తున్నామని అన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన ఇళ్లు పూర్తికాలేదు, వాటిని పూర్తి చేయడానికే మేము నిధులు పెంచుతున్నామని చెప్పారు.
ఎలక్ట్రికల్ రంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారని అన్నారు. డ్రోన్‌ల ద్వారా మందులు, ఆహార సరఫరా చేయడానికి త్వరలో గిరిజన గ్రామాలకు డ్రోన్‌ల ద్వారా మందులు పంపిణీ, చేయడం జరుగుతుందని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థికి “తల్లికి వందనం” పథకం అందుబాటులోకి వస్తుందని ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా ప్రతిఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుందని అన్నారు. ఎస్సీ ఎస్టీ వారికి ఫ్రీగా సోలార్ కరెంటు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. వికలాంగులకు, వృద్ధులకు ఎక్కువ మొత్తంలో పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికే ఎక్కిందని అన్నారు. మూడవ బిడ్డ పుడితే ప్రభుత్వం నుంచి వచ్చిన అన్ని సౌకర్యాలు ఆ కుటుంబానికి అందుతాయని అన్నారు.ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తారు, స్పీకర్ ఇవ్వరని జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలని అన్నారు. అసెంబ్లీ అంటే మా పార్టీకి దేవాలయం. మీరు నిజాయితీగా ఉంటే అసెంబ్లీలోకి వచ్చి ప్రశ్నించండని తెలిపారు. తల్లికి చెల్లికి విలువ ఇవ్వని నీకు ఆడపిల్లల గురించి ఆడవాళ్లు భద్రత గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, మండల అధ్యక్షుడు పరమేశు, మక్కువ మండల పార్టీ అధ్యక్షుడు గుల్ల వేణు గోపాల్ నాయుడు, పాచిపెంట నాయకులు ముఖి సూర్యనారాయణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : ఏపీ బడ్జెట్ అన్ని వర్గాల వారికి అనుకూలం)