Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఈద్గా అభివృద్ధికి 40 లక్షలు కేటాయించండి..

ఈద్గా అభివృద్ధికి 40 లక్షలు కేటాయించండి..

ఈద్గా అభివృద్ధికి 40 లక్షలు కేటాయించండి..

న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండలో ఈద్గా మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని, ఈద్గా అభివృద్ధికి వినుకొండ పురపాలక సంఘం నుండి 40 లక్షల రూపాయల నిధులు కేటాయించాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు మునిసిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని తిమ్మాయపాలెం రోడ్డులో గల కబ్రస్థాన్ శుభ్రం చేసేందుకు 5 లక్షలతో పరిపాలక సంఘం చేపట్టిన పనులను చీఫ్ విప్ జిబి ఆంజనేయులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించే ఈద్గా అభివృద్ధి చేయాలని ముస్లిం పెద్దలు తమకు విన్నవించడం జరిగిందన్నారు. ఈద్గా ప్రాంగణ చదును చేయటం, చుట్టూ ప్రహరీ, గేట్లు ఏర్పాటు తదితర అభివృద్ధి పనులకు సంబంధించి 40 లక్షల నిధులు కేటాయించేందుకు కౌన్సిల్ తీర్మానం చేయాలని ఆయన మున్సిపల్ చైర్మన్, అధికారులను ఆదేశించారు. ఈద్గా నిర్మాణం పనులకు సంబంధించి ముస్లిం సోదరులతో కలిసి సగం నిధులు శివశక్తి ఫౌండేషన్ అందిస్తుందని వెల్లడించారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్యేగా వినుకొండ కబ్రస్తాన్ లో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, సిమెంటు రోడ్లు, వీధి లైట్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఐదేళ్ల వైసిపి పాలనలో కబ్రస్థాన్ను పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని అన్నారు. ఇమాములు, బహుజన్లకు గత వైసిపి ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని, ఓటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు మౌజన్లకు, ఇమామ్లకు రావలసిన జీతాల బకాయిలను చెల్లించి ఆదుకోవడం జరిగిందన్నారు. ప్రతినెల జీతాలు వాళ్ళ అకౌంట్లోకి జమ అయ్యేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఉర్దూ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందన్నారు. ముస్లిం మైనారిటీ నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించిందన్నారు. ముస్లిం మైనారిటీల అభివృద్ధికి పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ముస్లిం సోదరులు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, కమిషనర్ సుభాష్ చంద్రబోస్, టిడిపి పట్టణ పార్టీ అధ్యక్షులు అయూబ్ ఖాన్, చెరుకుంపాలెం షమీం, పివి సురేష్ బాబు, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. (Story : ఈద్గా అభివృద్ధికి 40 లక్షలు కేటాయించండి..)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!