శివుడికి పౌర్ణమి పూజలు
న్యూస్‌తెలుగు/గుంతకల్లు : పట్టణంలోని పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావించే కసాపురం రోడ్డులోని భవాని గుడి వెనుక కాలనీలో వెలసినటువంటి శివాలయానికి పౌర్ణమి సందర్భంగా శుక్రవారం విశ్వహిందూ పరిషత్ హిందువులు అందరు కలిసి ఆలయ అర్చకులు లోక్ నాథ్ శర్మా చేతుల మీదుగా శివుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం నాగుల విగ్రహానికి కూడా ప్రత్యేక పూజలు చేశారు.శివుడి విగ్రహం వద్దకు కాలనీవాసులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా శివనామస్మరణతో ఆలయం వద్ద మార్మోగింది. అదేవిధంగా ఆలయం వద్ద ఉన్న రావి చెట్టు వద్ద పూజలు చేసి ప్రాంగణం కళకళలాడింది. ఈ పూజా కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు వడ్డే రమేష్ ,బిజెపి పట్టణ కార్యదర్శి రాజు, విశ్వ హిందూ పరిషత్ మండల కార్యదర్శి బిందు ,దుర్గా వాహిని సంయోజక్ ప్రమీల ,
దుర్గా వాహిని సహా సంయోజక్ అశ్విని,విశ్వహిందూ పరిషత్ సభ్యులు విశ్వనాథ్ ,బిజెపి మహిళా రాష్ట్ర కార్యదర్శి వనగుంది విజయలక్ష్మి, కడిమెల్ల మునిరాజు,వెంకట రాఘవేంద్ర,సింగంశెట్టి విశ్వనాథ్ ,విజయలక్ష్మి,సుందర్, కొలిమి వీరేష్ ,తిర్లోక్,గుజిరి వెంకటేష్ ,గుజరి సురేష్ ,బోయ వెంకటరాముడు,కురువ హరి,తలారి ఆనంద్,శివన్న,రామ్ బీమ్ , పాల్గొన్నారు.ఆలయ అర్చకులు భక్తులకు ఆలయం వద్ద తీర్థ ప్రసాదాలు అందజేశారు. (Story : శివుడికి పౌర్ణమి పూజలు)